ఇటీవల విడుదలైన శ్రీదేవీ డ్రామాకంపెనీ ప్రోమో అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంది. కడుపున పుట్టిన వారే కాదన్నారనే బాధలో ఉండే వారి మోముల్లో చిరు నవ్వులు విరబూయించే ప్రయత్నంలో భాగంగా వృద్ధాశ్రమంలో ఉంటున్న వారిని ఈ షోకు తీసుకొచ్చారు. అందులో వాళ్లల్లో కాస్త నవ్వులు పూయించేందుకు ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే ఆది ఓ బామ్మతో వేసిన డ్యాన్స్.. వాళ్లతో లవ్ చేస్తున్నా అంటూ చెప్పిన కామెడీ.. అందరిలోనూ ఆనందం నింపాయి. ఇక ఆదికి పెయిర్ దొరికినట్లే అని కామెడీ చేస్తే అలరించారు. అందులో ఓ పెద్దావిడ పాడిన పాటకు.. సుధీర్ భావోద్వేగానికి గురయ్యాడు.
‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి’ అంటూ ఆలపించి, హృదయాన్ని హత్తుకుంది. తన బిడ్డల్ని తలచుకుని కంటతడి పెట్టుకోవడంతో అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అమ్మ విషయంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సుధీర్. ఇక్కడ ఉన్న తల్లిదండ్రలు ఇంత బాధ అనుభవిస్తుంటే.. మీతో పాటు వాళ్లను కూడా తీసుకెళ్లొచ్చు కదా.. అంటూ వీరిని ఆశ్రమంలో వదిలేసిన వారిని కోరాడు సుధీర్.
ఇక ఇదే వేధికపై వాళ్ల బాధను చూడలేక.. వర్ష, భాను రూ.లక్ష విరాళం అందజేశారు. అంతే కాకుండా ఇంద్రజ కూడా వాళ్ల మెడికల్ కు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంతో కనుక్కొని.. ఒక్క వారం కాదు.. ప్రతీ నెలా తానే భరిస్తానని.. ఆ ఖర్చులకు డబ్బులు నేనే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రోమో ప్రతీ ఒక్కరి హృదయాన్ని బరువెక్కిస్తోంది. ఈ ప్రోగ్రాం పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 3 న విడుదల కానుంది.































