Sujitha: నటి కళ్యాణి కిరణ్ విడాకులు తీసుకోవడానికి కారణం ఆర్థిక సమస్యలే… నటి సుజిత కామెంట్స్ వైరల్!

0
83

Sujitha:నటి సుజిత పరిచయం అవసరం లేని పేరు పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె అనంతరం పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేశారు అలాగే పలు సినిమాలలో కూడా సందడి చేశారు. ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుజిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె నటి కళ్యాణి కిరణ్ జంట గురించి పలు విషయాలు తెలియజేశారు..

కిరణ్ స్వయాన తన అన్నయ్య కావడం విశేషం ఇలా కిరణ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దర్శకుడుగా కొనసాగారు. ఆ సమయంలోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణిని ఈయన పెళ్లి చేసుకున్నారు. కళ్యాణి పేరుకే వదిన అయినప్పటికీ నన్ను చాలా బాగా చూసుకునేవారు మేమిద్దరం సొంత అక్క చెల్లెలు మాదిరిగా ఉండే వాళ్ళమని సుజిత తెలిపారు. ఇక తాను షూటింగ్ పనుల నిమిత్తం హైదరాబాద్ వస్తే స్వయంగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వారితో కలిసి ఉండే దానిని తెలిపారు.

ఇక అన్నయ్య తన జీవితంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే వారి జీవితాలు ఇలా మారడానికి కారణమని సుజిత తెలిపారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి తరుణంలో సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం అన్నయ్య నాతో చెప్పితే నేను కూడా సరే అని చెప్పాను కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పుల పాలయ్యారని తెలిపారు.

Sujitha: ఆస్తులన్నీ అమ్మేశారు…


ఇలా అప్పులు తీర్చడం కోసం వీరు ఉన్న ప్రాపర్టీని కూడా అమ్మేసుకున్నారు దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ ఈ సందర్భంగా తన అన్నయ్య కిరణ్ నటి కళ్యాణి విడాకుల గురించి సుజిత చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది ఇండస్ట్రీ అందరికీ కలిసి రాదని, అప్పుచేసి సినిమాలు చేయడం పెద్ద తప్పు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు.