Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో చిత్ర పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే సినీ లోకం తరలివచ్చి ఆయనకు కన్నీటితో నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో కృష్ణ గారి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా తాజాగా కృష్ణ మరణం అనంతరం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు కృష్ణ గారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే కృష్ణ విజయ నిర్మలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయనిర్మల కుమారుడైన నరేష్ తో కృష్ణ గారు ఎలా ఉండేవారు అనే విషయం గురించి యాంకర్ ప్రశ్నించగా ఇమంది రామారావు మాట్లాడుతూ.. నరేష్ అంటే కృష్ణకి పెద్దగా ఇష్టం ఉండేది కాదని తెలిపారు.ఇకపోతే కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే ఆయన ఏకంగా నటి పవిత్ర లోకేష్ ను వెంట పెట్టుకుని రావడం పట్ల రామారావు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
ఈ విధంగా కృష్ణ గారు మరణించారనే వార్త తెలియగానే నరేష్ పవిత్ర లోకేష్ తో పాటు ఆయనని చూడటానికి రావడంతో అక్కడ కృష్ణ గారి ఫ్యామిలీకి ఎలా ఉంటుంది వాళ్ళందరూ తలదించుకునే పని చేసినట్టే కదా అంటూ ఈయన మండిపడ్డారు. ఇక తను పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తే చేశారు కానీ ఇలా తనతో పాటు కలిసి కృష్ణ గారిని చూడటానికి రావడం ఏమాత్రం భావ్యంగా లేదని తెలిపారు.

Super Star Krishna: కృష్ణ ఫ్యామిలీకి అవమానమే
ఈ విధంగా నరేష్ చేసిన పనికి ఆయన కుటుంబ సభ్యులు తలదించుకోవడమే కాకుండా కృష్ణ గారి ఆత్మ కూడా శాంతించదు అంటూ ఇమంది రామారావు నటి పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం గురించి మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కృష్ణ గారు హాస్పిటల్ లో చేరారని విషయం తెలిసినప్పటి నుంచి నరేష్ తనతో పాటు ఉన్నారు. అయితే కృష్ణ గారి మరణం ఉన్న తర్వాత ఏదైనా నటి పవిత్ర లోకేష్ తో కలిపి ఆయనని చూడటానికి వచ్చారనే విషయం మనకు తెలిసిందే.































