Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కాలేయ వ్యాధితో బాధపడుతూ.. ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న ట్విట్టర్ వేదికగా ఘట్టమనేని ఫ్యామిలీ తెలియజేసింది.

మా ప్రియమైన రమేష్‌బాబు గారు మరణించారని మేము చాలా బాధతో తెలియజేస్తున్నాము అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల మహేష్ బాబు కరోనాతో బాధపుడుతున్న విషయం తెలిసిందే. అతడు హోం క్వారంటైన్ లో ఉంటూ.. చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల అతడు దుబాయ్ కు వెళ్లి రాగా.. కోవిడ్ టెస్టు చేయించుకున్నాడు. దాంతో మైనర్ లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబసభ్యులు అంతా హోం క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో అతడి అన్నయ్య దహనసంస్కారాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య..
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబును తన అన్న భౌతిక ఖాయాన్ని చూడటానికి అనుమతినివ్వలేదు. దీంతో తొలిసారి అతడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశాడు. ‘‘నువ్వే నాకు స్పూర్తి.. నీవే నా బలం.. నువ్వు నా ధైర్యం, నీవే నా సర్వస్వం, నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి… విశ్రాంతి తీసుకోండి. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను లవ్ యూ అన్నయ్య అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మహేష్ బాబు. ఆ ఎమోషనల్ వర్డ్స్ తో పాటు.. అతడి అన్నయ్య ఫొటోను ఇన్ స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అతడి ఎమోషనల్ పోస్టు వైరల్ గా మారింది.































