Surekha Vani: సినిమాలకు తాను దూరం కాలేదు.. తనకు అవకాశాలు రాలేదంటూ ఎమోషనల్ అయినా సురేఖవాణి!

0
178

Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సురేఖ వాణి.ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో అక్కగా పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇలా ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన కూతురితో కలిసి చేసే హంగామా మామూలుగా లేదు.

తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేసే సురేఖవాణి హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఈ వయసులో కూడా ఈమె ఓ రేంజ్ లో అభిమానులను సందడి చేస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా సురేఖ వాణి స్వాతిముత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సురేఖ వాణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ చాలా మంది తనని సినిమాలకు దూరమయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి సురేఖవాణి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సురేఖ వాణి మాట్లాడుతూ అసలు సినిమాలు మాదాక వస్తే కదా చేయడానికి అంటూ అసలు విషయం చెప్పారు.

Surekha Vani: అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా…

ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే తనకి ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు రావడం లేదని అలా ఎందుకు జరుగుతుందో తనకు ఇప్పటికే అర్థం కాలేదని తెలిపారు.నేను సినిమాలకు దూరం కాలేదని నాకు సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తనకు సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఇక స్వాతిముత్యం సినిమాలో తనకు ఇలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.