Tag Archives: coronavirus

Singer Kousalya: కోవిడ్ బారినపడ్డ సింగర్ కౌసల్య.. బెడ్ మీదనుంచి లేవలేని పరిస్థితిలో..

Singer Kousalya: కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమను నీడలా వెంటాడుతుంది.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి రోజూ ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఈ వైరస్ తో పోరాడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.

తాజాగా సింగర్ కౌసల్య సైతం కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలిపారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాను అని తెలిపారు.

ఈ వైరస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయని, రెండు రోజుల నుంచి బెడ్ పై నుంచి పైకి లేవలేక పోతున్నాను అంటూ ఈమె తెలియజేశారు. జ్వరంతో పాటు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉందని నిన్నటి నుంచి మందులు వాడటం కూడా మొదలు పెట్టానని తెలిపారు.

త్వరలోనే మీ ముందుకు వస్తా…

ఈ వైరస్ తో పోరాడి ఆరోగ్యవంతంగా తిరిగి త్వరలోనే మీ ముందుకు వస్తాననీ దయచేసి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాలను తెలియ చేశారు.ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది ప్రముఖులు ఈమెకు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఆక్సిజన్ కొరతతో కేవలం ఒక్కరు మాత్రమే మరణించారు.. కేంద్రం వెల్లడి..

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను విడిచారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఆక్సిజన్ కొరతతో చాలామంది చనిపోయారని మనం వార్తా పత్రికల్లో.. మీడియాల మొన్నటి వరకు చాలానే విన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో మరణించింది కేవలం ఒక్కరు మాత్రమే అంటూ ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు తమకు అందిన వివరాల ప్రకారం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్‌ కొరత కారణంగా ఒకరు మరణించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ రాష్ట్రం పేరును మాత్రం ఆయన బయట పెట్టలేదు. మిగిలిన రాష్ట్రాల్లో అలాంటి మరణాలు సంబవించలేదంటూ కేంద్రానికి తెలిపాయని అతను వెల్లడించారు.

పార్లమెంట్ లో అంతకముందు ఆక్సిజన్‌ కొరత కారణంగా సంభవించిన మరణాలను వెల్లడించాలంటూ కొంతమంది అడిగిన ప్రశ్నకు వివరాలను తెప్పించుకొని ఇలా మీడియా ముందు అగర్వాల్ వెల్లడించారు. ఈ ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి వివరాలను ఈ నెల 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరగా.. అయితే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు 13 రాష్ట్రాలు వివరాలను సమర్పించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఆక్సిజన్ కొరత కారణంగా పంజాబ్ లో కోవిడ్ మరణాలు చాలా చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై రాజకీయ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారని.. వారి వివరాలను వెల్లడించడంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నాయి. ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.

గుడ్ న్యూస్.. ఇక వారికి దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉండవు..!

కరోనా సోకిన పిల్లల్లో కోవిడ్ వ్యాధి లక్షణాలు దీర్ఘకాలంగా ఉండవు. ఒక వారంలోనే కోలుకుంటారు. దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు కొద్దిమంది పిల్లలలో మాత్రమే కనిపిస్తాయని లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం 20 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే నెల రోజుల పాటు బాధపడుతున్నారని తెలిపింది. అది కూడా 4 వారాలు మాత్రమే అని పరిశోధనలో వెల్లడైంది.

అదే 8 వారాల దాకా ఉన్నాడంటే మాత్రం.. ఆ పిల్లాడు పూర్తిగా కోలుకుంటాడు. పిల్లల్లో కోవిడ్ లక్షణాల్లో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు గొంతు నొప్పి, అలసట, తలనొప్పి మరియు వాసన రాకపోవడం. దీనికి సబంధించి అక్కడ కౌమార ఆరోగ్యం అనే జర్నల్‌లో ప్రచురించారు. కోవిడ్ బారిన పడిన పిల్లలు 4.4 శాతం వరకు మాత్రమే ఎక్కువ కాలం కోలుకోకుండా ఉంటుంన్నారని వెల్లడించింది.

4 వారాలలోపు కోలుకున్న వారికి కూడా ఎలాంటి ఇతర రోగాలు రావంటూ తెలిపారు. ఈ పరిశోధనను కోవిడ్ యాప్ అయిన జో యాప్ తో నిర్వహించారు. ఇది ఇంగ్లాండ్ లోని ప్రజలు ఉపయోగిస్తారు. ఈ యాప్‌లో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 2.5 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటా ఉంటుంది.
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.

సోకినా చాలా మంది పిల్లలు లక్షణాలను కూడా చూపించరు లేదా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది పిల్లల్లో కోవిడ్ ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియదని చెబుతున్నారు. పిల్లలకు కోవిడ్ వల్ల విపరీతమైన ప్రమాదం మాత్రం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది.

50 కోట్లకు మందికి పైగా వ్యాక్సినేషన్.. మెుత్తం కరోనా కేసులు ఎన్నంటే!

దేశంలో కరోనా కేసులు స్వల్ఫ హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం విడుదల చేసిన నివేదికలో 44 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా శనివారం 38 వేలుగా నమోదవ్వగా… 617 మంది మృతిచెందారు. శుక్రవారంతో పోలిస్తే ఇది 13 శాతం కంటే తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్‌గా ఉండగా 3,10,55,861 మంది కరోనా నుంచి కొలుకున్నారు.

దేశంలో వ్యాక్సినేషన్ పంపీణి వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. 24 గంటల్లో 49,55,138 మందికి టీకాలు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక వ్యాక్సిన్‌ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై పంజా విసురుతున్న కరోనా.. జాగ్రత్తంటున్న నిపుణులు..?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అందరి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ జీవనశైలి వ్యాధిగ్రస్తులు అయినటువంటి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండ వంటి తదితర సమస్యలతో బాధపడే వారిలో అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత వారిలో అధికంగా ఉంటుంది.తద్వారా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, మధుమేహంతో బాధపడేవారిలో మూడింతలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారిలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధులతో బాధపడేవారికి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరించారు.

ఈ విధమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరిలో ఎలాంటి యాంటీబాడీలు వృద్ధి చెందడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ ఏ వస్తువును తాకిన శానిటైజర్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని తగినన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే ఈ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్.. ఆ రెండు రోజులు కఠిన నిబంధనలు?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేసి కరోనా మహమ్మారిని కట్టడి చేశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపు ఇచ్చారు. ఈ క్రమంలోనే కేవలం రాత్రి సమయంలో మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పాజిటివ్ రేటు 10% ఉండటంతో కరుణ కేసులను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24, 25 వ తేదీలలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను మైక్రో కంటెంట్ జోన్లుగా విభజించాలని వీలయినంత వరకు కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు లేదని, వారాంతంలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి ఆదేశించారు

కరోనా బాధితులను కలవరపెడుతున్న మరో వైరస్… ఏమిటంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారిన పడిన వారిని వివిధ రకాల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటి వివిధ రకాల వైరస్ లు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ విధమైనటువంటి వైరస్ వ్యాప్తి జరిగే కొందరు మరణం కూడా పొందారు.అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే కరోనా బాధితులలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.

ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులలో సిఎంవి ఇన్ఫెక్షన్ లేదా సైటోమెగలో వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. అయితే వీరిలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. ఈ విధంగా ఈ కొత్త ఇన్ఫెక్షన్ కరోనా బాధితుల లో బయటపడటం ఇదే మొట్టమొదటిసారి.కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సుమారు నెల రోజుల వ్యవధిలో ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించామని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వ్యక్తి రక్తం, మూత్రం,లాలాజలం వంటి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భాటియా హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విపుల్‌రాయ్ రాథోడ్ మాత్రం ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అని తెలిపారు.

సాధారణంగా గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట జ్వరం దగ్గు గ్రంథుల వాపు వంటి లక్షణాలు ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. అయితే వీటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించదని ఈ చికిత్సలో భాగంగా యాంటీ వైరల్ మందులు వాడటం వల్ల ప్రమాదం నుంచి బయట పడవచ్చు అని ఈ సందర్భంగా డాక్టర్ విపుల్‌రాయ్ రాథోడ్ తెలిపారు.

ఒకే ఊపిరితిత్తితో ఆక్సిజన్ తీసుకోవాలి.. అయినా దైర్యంగా కరోనాను జయించిన చిన్నారి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తూ ఎంతో ఆరోగ్యవంతమైన ప్రజలను సైతం కుంగదీసి వారిని మరణం అంచులకు తీసుకెళ్ళింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆరోగ్యవంతులు యువకులు మృత్యువాతపడ్డారు. ఒక సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తికి ఈ వైరస్ ఎంతో ప్రమాదకరంగా మారింది. కానీ ఓకే ఊపిరితిత్తితో ఆక్సిజన్ తీసుకునే చిన్నారిపై మహమ్మారి పంజా విసిరింది. అయితే ఆ చిన్నారి ధైర్యం కోల్పోకుండా ఆమె ధైర్యానికి కరోనా పారిపోయింది.

ఇండోర్ లోని సంఘీ కాలనీలో నివసిస్తున్న ఎలక్ట్రిక్ వ్యాపారవేత్త అనిల్ దత్ రెండో కుమార్తె సిమి. 2008వ సంవత్సరంలో సిమి గర్భంలో ఉన్నప్పుడు సోనోగ్రఫీ జరిగింది. అప్పుడు వైద్యులు తన ఆరోగ్యం బాగుంది అని చెప్పారు. కానీ తను పుట్టిన తర్వాత తనకు ఎడమ చేయలేదు, అదేవిధంగా మూత్రపిండాలు సరిగా అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ తన కూతురును ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు.

వయసు పెరిగే కొద్దీ సిమి ఒక ఊపిరితిత్తి కూడా క్రమంగా కుచించుకుపోవడంతో ఆమెకు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు ప్రతిరోజు రాత్రి ఆక్సిజన్ అందించే వారు. ఈ కరోనా సమయంలో చిన్నారిని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి తల్లి కరోనా వ్యాధి బారిన పడటంతో చిన్నారి సిమికి కూడా కరోనా సోకింది.

కరోనా సోకిన సమయంలో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నఫలంగా 50కి పడిపోయాయి.సిమి కుటుంబం డాక్టర్ ముతిహ్ పరియకుప్పన్ ను సంప్రదించింది. ఇంట్లో, అమ్మాయికి బిపెప్, ఆక్సిజన్ ఇచ్చారు. సుమారు 12 రోజుల పాటు ఇదే పరిస్థితిలో ఉన్న సిమి చివరికి మహమ్మారితో పోరాడి జయించింది. ఈ విధంగా ఒకే ఊపిరితిత్తితో ఆక్సిజన్ తీసుకున్నప్పటికీ ఎంతో ధైర్యంగా కరోనాను జయించి ఆ ఎంతో మందికి ధైర్యంగా నిలిచింది.

కొరియర్ లో ఆక్సిజన్ సిలిండర్.. సోనుసూద్ వినూత్న ప్రయత్నం!

దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో ఎంతో మందికి సహాయం చేస్తూ అందరిపట్ల ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందుతున్నాడు.కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తూ ఎంతోమంది ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోతున్న సమయంలో సోనూసూద్ పలు ప్రాంతాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

ఈ విధంగా ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో సహాయం చేస్తున్న సోన సూద్ కరోనా బాధితుల కోసం మరో అడుగు ముందుకు వేశారు.కరోనాతో బాధపడుతున్న ఏ ఒక్కరు ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కోసం ఇబ్బందిపడుతున్న బాధితుల కోసం ఇంటివద్దకే ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు.

దేశంలో ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే
www.umeedbysonusood.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని, ఆక్సిజన్ కోసం ఎవరైతే ఈ వెబ్సైట్ సంప్రదిస్తారో, సరాసరి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ కొరియర్ ద్వారా వెళ్తుందని తెలిపారు. అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిస్తామని తెలియజేశారు. అందుకోసం డీటీడీసీ కొరియర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయిన ఆక్సిజన్ అవసరమయ్యే బాధితులు ఎక్కడి నుంచి బుక్ చేసుకున్న వారి ఇంటికి సరాసరి ఆక్సిజన్ సిలిండర్ వెళ్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ విధంగా కరోనా బాధితుల పట్ల సోనుసూద్ చేస్తున్నటువంటి సహాయం పట్ల ఎంతో మంది అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుంది.. బిడ్డకు ప్రమాదమా?

ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు అన్ని దేశాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి మార్కెట్లోకి వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ 45 సంవత్సరాలు పైబడిన వారికి, ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇవ్వడం జరిగింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.అయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

వ్యాక్సిన్ కనుగొన్న సమయంలో అన్ని వయసుల వారి పై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. కానీ గర్భిణీ స్త్రీలలో మాత్రం ట్రయల్స్ నిర్వహించలేదు కనక ఈ వ్యాక్సిన్ ప్రభావం గర్భం దాల్చిన మహిళలు, కడుపులో బిడ్డ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, కరోనా బారిన పడినప్పుడు కలిగే దుష్ప్రభావాలు కన్నా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కలిగే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తేలికపాటి దుష్ప్రభావాలు కలుగుతాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు సర్వసాధారణం. వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీ బాడీస్ పిండంలో కూడా పెరగడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.

మొదటి దశ పోలిస్తే రెండవ దశలో ఎక్కువ భాగము గర్భిణీ స్త్రీలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ వైరస్ ను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించిందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సీడీసీ, ఎఫ్‌డీఏ, ఏ సీఓజీ, ఆర్‌సీఓజీ, ఎఫ్‌ఓజీఎస్‌ఐ వంటి సంస్థలు గర్భందాల్చిన మహిళలు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని సూచనలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా మాస్కు ధరించి, తరచూ చేతులు శుభ్రంగా కడగడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తల ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.