గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకు వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆఫీసులకు వెళ్లేవారు ఇంటినుంచి పని చేయగా, స్కూలుకు వెళ్లే చిన్నారులు ఆన్లైన్ క్లాసులతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారు మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పిల్లలు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావడం వల్ల వారిలో మరి కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు కరోనా బారిన పడకుండా వారిని ఎలా రక్షించుకోవాలి. వారిలో ఉన్న మానసిక ఆందోళనలు ఏవిధంగా తొలగించాలనే విషయం గురించి పలువురు నిపుణులు తెలియజేశారు. మరి పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా స్కూల్ కి వెళ్లి తోటి పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతూ చదువుకునే విద్యార్థులు ప్రస్తుతం ఇంటిలో ఆన్లైన్ క్లాసులకు పరిమితమయ్యారు. ఈ విధంగా నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి ఆందోళనలు అధిక శ్రమ వారిలో మరి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో ఎంతో చనువుగా, ప్రేమగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల వారిలో ఒత్తిడి తగ్గుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు కేవలం వారికి చదువు పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తలెత్తే సమస్యలను సైతం ఉపాధ్యాయులు అడిగి తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించేవారు.ఈ విధంగా తల్లిదండ్రులు కూడా వారు ప్రతి చిన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే పిల్లలలో ఎలాంటి ఆందోళనలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితుల నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే తల్లిదండ్రులు కొంత సమయం పాటు దగ్గరుండి ఆ విలువైన సమయాన్ని పిల్లలతో హాయిగా గడపటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి చిన్న విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి మానసిక సమస్యలకు,కరోనా వంటి మహమ్మారి బారిన పడకుండా రక్షించగలమని నిపుణులు తెలియజేస్తున్నారు.































