తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఆ యాప్ లో రిజిష్టర్ చేసుకుంటేనే వ్యాక్సిన్..?

0
99

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. శ్రీనివాసరావు కో – విన్ యాప్ లో రిజిష్టర్ చేసుకుంటే మాత్రమే వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

కోవిడ్ వ్యాక్సిన్ కు సిద్ధంగా ఉన్నామని.. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని 1,200 కేంద్రాలలో వారానికి నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులలో సైతం వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ పది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కో – విన్ వెబ్ సైట్ ద్వారా సులభంగా రిజిష్టర్ చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు.

కో – విన్ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ లో ఆధార్ వివరాలను నమోదు చేసి ఆధార్ నంబర్ రిజిష్టర్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా వ్యాక్సిన్ కోసం రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత మొబైల్ నంబర్ కు వ్యాక్సిన్ ఎక్కడ, ఎప్పుడు వేస్తారనే వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం వెబ్ సైట్ ద్వారా ఫ్రంట్ లైన్ వారియర్స్ మాత్రమే రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంది.

త్వరలో సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ కోసం రిజిష్టర్ చేసుకునే అవకాశం రానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. తొలి విడతలో దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here