టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను పూర్తి చేసుకున్న మెగాస్టార్ అనంతరం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు చేతికి స్వల్ప గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మలయాళ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారు అన్న విషయం ఫై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించగా, ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం పై దర్శక నిర్మాతల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అంతే కాకుండా ఇందులో ఒక పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.
ఈ విషయాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన పాట కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టు గానే ఉండాలని బ్రిట్నీ స్పియర్ తో పాడించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా మరేదైనా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక తమన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇందులో సల్మాన్ ఖాన్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది.






























