స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటిసారిగా అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత చిన్న చిన్నగా ఎదుగుతూ స్టార్ హీరోల సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా వంటివి భారీ చిత్రాలను కూడా తెరకెక్కించారు.

అలా సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి తాజాగా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ కోసం హంగేరికి వెళ్లి వచ్చాక కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏజెంట్ సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. హీరో అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సురేందరర్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇక హంగేరిలో ఈ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. సురేందర్ రెడ్డి కోలుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కానుంది.































