ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ చిన్న తప్పే దాసరి మరణానికి కారణమయ్యింది : రేలంగి

0
778

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, నిర్మించిన దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నటించారు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.

దాసరి సినీ జీవితం విషయానికి వస్తే ఎంతో మంది నటీ నటులను దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి సినీ పెద్దగా, గురువు, మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు దగ్గర శిష్యరికం పొందిన డైరెక్టర్ రేలంగి నరసింహారావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఆయన తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ తన గురువు గారు దాసరి మరణానికి కారణం తాను చేసిన చిన్న తప్పు అనే విషయాన్ని వెల్లడించారు. దాసరి నారాయణ రావు గారు అధిక శరీర బరువు కావడం వల్ల శరీర బరువు తగ్గించుకోవడం కోసం సర్జరీ కాకుండా బెలూన్ వేయించుకున్నారు. అయితే 6 నెలల తర్వాత ఆ బెలూన్ తీసివేయించి అదే సమయంలో ఎవరికీ తెలియకుండా మరోసారి బెలూన్ వేయించుకున్నారు.

అయితే రెండోసారి బెలూన్ వేసే సమయంలో సీనియర్ డాక్టర్లు లేకపోవటంవల్ల జూనియర్ డాక్టర్లు బెలూన్ వేసే సమయంలో బెలూన్ పంక్చర్ కావడంతో అది కాస్త ఇన్ఫెక్షన్ అయింది. ఇలా ఆ ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడని ఈ సందర్భంగా దర్శకుడు రేలంగి నరసింహారావు దాసరి మరణం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here