బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం నేటితో 10 వారాలను పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలోనే 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ ఈ షోలో తొమ్మిది మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు నేడు మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు ఎలిమినేట్ కానున్నారు. అయితే 9వ వారం లో భాగంగా బిగ్ బాస్ నుంచి కండలవీరుడు విశ్వ బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన విశ్వ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే విశ్వ మాట్లాడుతూ అందరూ బిగ్ బాస్ ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతుందని భావిస్తారు నిజానికి అక్కడ జరిగేదంతా నిజంగా జరుగుతుంది కానీ స్క్రిప్టు ప్రకారం జరగదని తెలియజేశారు. 2002వ సంవత్సరంలో తన కెరీర్ మొదలు పెట్టానని తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని అయితే బిగ్ బాస్ ద్వారా నాకు మరింత ఆదరణ పెరిగిందని విశ్వ తెలియజేశారు.
బిగ్ బాస్ షో ద్వారా నేను ప్రతి ఒక్క కుటుంబానికి దగ్గర అయ్యానని అని తెలియజేశారు. బిగ్ బాస్ హౌస్ లో లోబో తనకు మంచి ఫ్రెండ్ గా మారాడని, బిగ్ బాస్ తనకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ లోబో అని ఈ సందర్భంగా విశ్వ తెలియజేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో శ్రీరామ్ విన్నర్ అవుతాడని, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే తప్పకుండా వెళ్దానని ఈ సందర్భంగా విశ్వ వెల్లడించారు.

































