నింగిలో వేల సంఖ్యలో గ్రహశకలాలు వివిధ మార్గాల్లో ప్రయాణం సాగిస్తుంటాయి. ఈ గ్రహ శకలాలు ఎక్కువ సంఖ్యలో మూలకాలను కలిగి ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా తిరిగే ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు భూమికి దగ్గరగా కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం ఒక గ్రహశకలం భూమికి సమీపంగా వెళ్లగా తాజాగా మరొక గ్రహశకలం దూసుకొచ్చింది. జూపిటర్, మార్స్ గ్రహాల మధ్యలో ఓ సైషే 19 అనే గ్రహశకలం పరిభ్రమణం చేస్తోంది.

పలు సందర్భాల్లో భూమి వాతావరణంలోకి గ్రహశకలాలు ప్రవేశిస్తే అవి చిన్న చిన్న ముక్కలు కావడంతో పాటు భూమిపై పడుతుంటాయి. అయితే ఓ సైషే గ్రహశకలం మాత్రం వాటికి భిన్నమైనది. ఈ గ్రహ శకలంలో అంచనాలకు అందని స్థాయిలో బంగారం, వజ్రాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం భూమిపైకి ఈ గ్రహ శకలాన్ని తీసుకొస్తే ఈ భూమిపై పేదవాడు అనే వాడే ఉండడు.

నాసా శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం గురించి అన్ని రకాల పరిశోధనలు చేస్తున్నారు. ఈ గ్రహశకలం ఖరీదు 8000 క్వాడ్రిలియన్ పౌండ్లు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిపై నివశించే ప్రతి ఒక్కరినీ 9,000 కోట్ల రూపాయలకు ఈ సంపద అధిపతిని చేయగలదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఏజెన్సీ సహాయంతో అక్కడికి రోబోను పంపించి ఆ గ్రహశకలంలో ఉన్న బంగారం, వజ్రాలను చూడాలని నాసా ప్రయత్నిస్తోంది.

అయితే కొన్ని సందర్భల్లో గ్రహశకలాల వల్ల మానవాళి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే అరుదుగా మాత్రమే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో ప్రజలు పెద్దగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో గ్రహశకలాలు భూమి వైపుకు వస్తాయని వాటిలో కొన్ని మాత్రమే భూమిని తాకుతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here