సాధారణంగా మన ఇంట్లో పెంపుడు జంతువులకు అవి చిన్నవిగా ఉంటే వాటి ఆకలి తీర్చడానికి పాలు పోయడ మనం చూస్తూనే ఉంటాం. అచ్చం ఇదే తరహాలో ఓ మహిళ పిల్లికి పాలు పోయడంతో ఆమె పై పోలీస్ కేసు పెట్టి కోర్టుకి ఈడ్చారు. పిల్లికి పాలు పోస్తే కేసు పెట్టడం ఏంటి? అని ఆశ్చర్య పోతున్నారు కదా! అవును ఆ ప్రాంతంలో ఈ విధంగా పిల్లికి పాలుపోయడం నేరమని ఆ విధంగా పిల్లికి పాలు పోయడం చూసిన స్థానికులు ఆ మహిళ పై కేసు పెట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో ఓ పార్కులో మహిళ పిల్లికి ఒక గిన్నెలో పాలు పోసింది. ఈ సంఘటనను చూసిన స్థానికులు78 ఏళ్ల జాన్ పీ హస్సీపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అలా ఎందుకు పెట్టారంటే…టాంపా రాక్వెస్ట్ క్లబ్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం కేవలం పెంపుడు జంతువులకు మినహా ఇతర జంతువులకు వారి కాలనీలో అనుమతి లేదు.

ఆ విధంగా ఆ కాలనీలో ఏ ఇతర జంతువులకైనా పాలుపోయడం, ఆహారం పెట్టడం వంటివి చేయడం నిషేధం. ఆ విధంగా చేసిన వారు నిబంధనలను ఉల్లంఘించినట్లని భావించి వారిపై కేసు నమోదు చేస్తారు. ఈ సందర్భంగానే జాన్ పీ హస్సీపై కూడా కేసు నమోదు చేశారు. అమెరికా వాసులు నల్ల పిల్లి, గుడ్లగూబను అశుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటికి ఆహారం పెట్టడం వల్ల ఆ శుభం జరుగుతుందని వారు భావిస్తారు. అయితే జాన్ పీ హస్సీపై నల్ల పిల్లికి పాలు పోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ విధంగా కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం ఫ్లోరిడాలోని కోర్టులో జరుగుతుంది.ఈ విషయంపై ఆ వృద్ధురాలు మాట్లాడుతూ నాకు ఆకలిగా ఉన్న పిల్లి, కుక్కలకు పాలు పోయడం అలవాటని ఎప్పుడు కారులో తనతో పాటు కొన్ని లీటర్ల పాలు తీసుకు వెళుతుంటారని ఈ విధంగానే అక్కడికి వచ్చిన పిల్లికి పాలు పోశాననీ తెలిపారు. అదేవిధంగా నా దృష్టిలో నలుపు-తెలుపు అని సంబంధం లేదు జంతువులను ఒక్కటేనని అందుకోసమే వాటికి పాలుపోసానని, పాలు పోవడం వల్ల ఈ విధంగా నా పై కేసులు పెట్టడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందంటూ ఆ మహిళ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here