Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విధంగా పుష్ప సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా అద్భుతమైన హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పుష్ప సీక్వెల్ చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పై కోపంతో రౌడీలు శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మికను చంపేస్తారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తపై నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ ఈ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు.ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక చనిపోతుందని అలాగే కొందరి పాత్రల గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు.
అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే..
ఇప్పటివరకు కథను మేము ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా వినలేదు.ఈ సినిమా గురించి ఎవరికీ ఏమీ తెలియదు కనుక ఏ సినిమా గురించి ఏ విధమైనటువంటి వార్తలు వచ్చినా తొందరగా నమ్ముతున్నారు. అయితే శ్రీవల్లి పాత్ర గురించి వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఈయన ఆ వార్తలను కొట్టిపారేశారు ఇదే విషయాన్ని పలు న్యూస్ ఛానళ్లు వెబ్ మీడియా కూడా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.































