vicky -Kaushal: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ వివాహం జరిగి కొద్ది రోజులైనా జరగకనే అతనిపై మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి పోలీస్ కేసు పెట్టారు. అసలు నటుడు విక్కీ కౌశల్ పై కేసు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ లుకా చుప్పి 2 అనే చిత్రంలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి చిత్రబృందం ఒక మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ ఉంటారు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్ యాదవ్ అనే వ్యక్తం చేస్తే పోలీస్ కేసు వేశాడు.

ఈ వ్యక్తి పోలీస్ కేసు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ వీడియోలో విక్కీ కౌశల్ నడుపుతున్న బండి నెంబర్ కి తన బండి నెంబర్ ప్లేట్ ఉపయోగించారని జై సింగ్ యాదవ్ వీరిపై పోలీస్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలా ఉపయోగించాలి చట్టరీత్యా నేరం..
లుకా చుప్పి 2చిత్ర బృందం తన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా తన నెంబర్ ప్లేట్ ను సినిమాలో బండికి ఉపయోగించడం చట్టరీత్యా నేరమని జై సింగ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై తను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదుపై చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.





























