Geetha Madhuri -Nandu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో గీతామాధురి ఒకరు.ఈమే తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక గీతామాధురి నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే గీతా మాధురి దంపతులకు ఇటీవల ఓ కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు ఓ బిడ్డకు జన్మనిచ్చినటువంటి ఈ దంపతులు తమ రెండవ సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి ధ్రువ ధీర్ తారక్ అనే నామకరణం చేశారు. అయితే తన కొడుకు పేరులో తారక్ అని రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక తన కొడుకు పేరులో తారక్ పెట్టడానికి గల కారణమేంటనే విషయాన్ని నందు ఇటీవల వెల్లడించారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ తనుకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అందుకే తన పేరులో ఉన్నటువంటి తారక్ పేరును నా కొడుకుకు పెట్టుకున్నానని తెలిపారు. అంతేకాకుండా తారక్ అనే పేరులో ఒక వైబ్రేషన్ ఉందని తెలియజేశారు.
అయోధ్య బాల రాముడు
ఇకపోతే ఈ ఏడాది అయోధ్యలో బాల రాముడు కొలువై ఉన్నారు. ఇలా బాల రాముడు కొలువై ఉన్నటువంటి సమయంలోనే మా ఇంట్లోకి కూడా బాబు అడుగు పెట్టడంతో సాక్షాత్తు తారక రాముడే ఇలా మా ఇంట జన్మించారని మేము భావించాము అందుకే తమ కొడుకు పేరులో తారక్ వచ్చేలాగా పెట్టామంటూ ఈ సందర్భంగా నందు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































