Omicron New Symptom: భారత దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు దేశంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అతి తక్కువ లక్షణాలతో వేగంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిని కూడా వదలడం లేదు.

ఈ క్రమంలోనే బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బృందం ఒమిక్రాన్‌కి సంబంధించిన కొత్త లక్షణం గురించి తెలియజేశారు.ఈ మహమ్మారి లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ ఇది కళ్ళనుంచి గొంతు గుండె మెదడు వంటి భాగాలను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

ఈ వేరియంట్స్ శరీర భాగాలపై ఏవిధమైనటువంటి ప్రభావం చూపిస్తుందోనని నిపుణులు పరిశోధనలు చేయడంతో ఈ పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధి బారిన పడిన వారి చెవి నమూనాలను పరిశీలించారు.
చెవికి సంబంధించిన సమస్యలు అధికం..
అయితే ఈ మహమ్మారి బారిన పడిన వారు ఎక్కువగా చెవినొప్పి చెవిలో జలదరింపు రావడం వంటి సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే చెవి నొప్పి, చెవికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటాయని ముఖ్యంగా ఇది టీకాలు ఎక్కువగా వేసుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.ఏ మాత్రం చెవి సంబంధిత సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని లేదంటే వినికిడి లోపం తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలియజేశారు.




























