ఈ వస్తువులను డబ్బులిచ్చే తీసుకోవాలి.. లేకపోతె తీవ్ర ఇబ్బందులు..

0
907

మన రోజువారి జీవితంలో చేసే కార్యక్రమాలలో ఎన్నో పొరపాట్లు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. ఈ విధంగా మనం చేసే తెలిసీ తెలియని పొరపాట్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి విషయాలను గురించి మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి.ముఖ్యంగా మనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకునేటప్పుడు ఉచితంగా తీసుకోకూడదు.ఒకవేళ వారి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

ఉప్పు: ఉప్పు మన రోజువారి వంటలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. వంటలలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఉప్పు సముద్రగర్భం నుంచి పుట్టినది కాబట్టి ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక ఎటువంటి పరిస్థితులలో ఇతరులకు ఉచితంగా ఇవ్వకూడదు. అదే విధంగా ఇతర నుంచి ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ ఉప్పును ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే వారి నుంచి కొంత మొత్తంలో డబ్బులు తీసుకుని ఉప్పును ఇవ్వాలి.

నువ్వులు:
మన ఇతరుల నుంచి నల్లటి నువ్వులను ఉచితంగా తీసుకోకూడదు. నల్లటి నువ్వులు రాహువు-కేతువు, శనికి ప్రతీకగా చెబుతారు. కనుక నల్లటి నువ్వులతో ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవటం వల్ల వీరి ముగ్గురి ప్రభావం మనపై ఏర్పడుతుంది.

సూది: డబ్బులు చెల్లించకుండా ఎట్టి పరిస్థితులలో సూదిని ఇతరుల నుంచి తీసుకోకూడదు. ఈ విధంగా సూదిని విరాళంగా తీసుకోవటం వల్ల ఇంటి సభ్యుల మధ్య వివాదాలను సృష్టిస్తుంది. దీంతో మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

రుమాలు: చేతులు మనం ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు. అదే విధంగా ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు.ఈ విధంగా రుమాలు ఉచితంగా ఇవ్వటం వల్ల ఎంతో స్నేహం ఏర్పడిన వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది.

ఇనుము: ఇనుమును శని దేవునికి ప్రతీకగా భావిస్తారు. కనుక ఇతరులకు డబ్బులు ఇవ్వకుండా ఇనుమును మన ఇంటికి తీసుకెళ్తే సరాసరి శనిని మన వెంట తీసుకు వెళ్లినట్లు. అందుకే ఇతరుల నుంచి తీసుకునేటప్పుడు కొంత మొత్తం డబ్బు చెల్లించాలి. అలాగే ఎటువంటి పరిస్థితులలో కూడా ఇనుమును శనివారం మన ఇంటికి తెచ్చుకోకూడదు.

నూనె:
ఇతరుల నుంచి నూనెను ఉచితంగా తీసుకోవటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కనుక నూనెను ఉచితంగా తీసుకు వెళ్ళ కూడదు.ఈ విధంగా నూనెను ఉచితంగా తీసుకోవటంవల్ల అశుభంగా పరిగణిస్తారు కనుక డబ్బులు చెల్లించే నూనెను తీసుకోవాలి.