బాక్సాఫీసు వద్ద ఒక సినిమా విజయవంతం కావాలంటే కథను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్ది, ప్రతి ఒక్క విషయంలో ఎన్నో మెళకువలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ పాత్రకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడమే కాకుండా ఫోటోగ్రఫీ, సంగీతం వంటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేస్తుంది.

అదేవిధంగా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హైలెట్ చేసి.. క్లైమాక్స్ కి వచ్చేసరికి సాగదీసిన, ఎమోషనల్ సెంటిమెంట్ పెట్టిన ప్రేక్షకులు అలాంటి సినిమాలను ఇష్టపడరు. మరి క్లైమాక్స్ సరిగా లేని కారణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

శీను: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వెంకటేష్ నటించిన శీను సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మూగవాడి పాత్రలో నటించినటువంటి వెంకటేష్ క్లైమాక్స్ సరిగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం అందుకోలేకపోయింది.

వేదం: అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను దక్కించుకుంన్నప్పటికీ క్లైమాక్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ సంపాదించుకుంది.

చక్రం: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన టువంటి చిత్రం చక్రం. ఇందులో క్యాన్సర్ పేషెంట్ గా నటించిన ప్రభాస్ ఓవర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

భీమిలి: నాచురల్ స్టార్ నాని తన సినిమాలన్నింటిలోనూ సహజసిద్ధంగా నటించడానికి ప్రాధాన్యత ఇస్తారు.ఈ క్రమంలోనే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు మొదటి భాగం ప్రేక్షకులను మెప్పించిన ఇప్పటికీ క్లైమాక్స్ లో నాని చనిపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించింది.

మెరుపు కలలు: ప్రభుదేవా, కాజోల్, అరవింద స్వామి కాంబినేషన్లో వచ్చిన మెరుపు కలలు సినిమా మొదటి హాఫ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికి క్లైమాక్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.


































