గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ, కోట్లాది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ముఖ్యంగా అధిక జనాభా గల భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీన్ని గుణపాఠంగా తీసుకున్న ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

కరోనా వైరస్ థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇప్పటికే చాలా మంది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్న సందర్భంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లేదా సమీప బంధువుల నుంచి ఎక్కువగా వ్యాప్తి జరుగుతుంది కావున తల్లిదండ్రులు తమకు కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించిన టెస్ట్ చేయించుకోవడం మంచిది.
ఇప్పటివరకు చాలామంది పిల్లల్లో తేలికపాటి వ్యాధి లక్షణాలే కనిపించాయి. కరోనా థర్డ్ వేవ్
లో చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు పొడి దగ్గు, గొంతు నొప్పి,వాంతులు,విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,రుచి, వాసన కోల్పోవడం, చర్మంపై దద్దుర్లు,కళ్లు ఎర్రబడటంఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమాని వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
పిల్లల్లో కోవిడ్ సోకిన 2 నుంచి 4 వారాల తరువాత MIS-C (మల్టీ ఇంఫ్లమేటరీ సిండ్రోం) వ్యాధి లక్షణం అరుదుగా కనిపిస్తుంది. దీని వలన పిల్లల శరీరంలో పాజిటివ్ యాంటీబాడీస్ తయారవుతాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ ఉండాల్సిన స్థాయి కన్నా చాలా ఎక్కువగా స్పందిస్తుంది. అయితే ఈ లక్షణం పిల్లల్లో అరుదుగా కనిపిస్తుంది కాబట్టి దీని గురించి తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముందస్తు చర్యగా భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లిదండ్రులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతోంది.































