Life Style: భూమిపై బతికి ఉన్న ప్రతీ జీవికి తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు.. బతకడానికి గాలి అత్యంత అవసరం. ఈ మూడు యూనివర్సల్ నీడ్స్ అంటారు. ఇవి ఉంటే.. ఏ జీవి అయినా ఈ భూమిపై బతకొచ్చు. అలా అయితే ఈ ధరణిపై మనుగడ సాగుతుంది.

ఎంత దాహం వేసినా.. చచ్చిపోవాల్సి వచ్చినా.. నీరు తాగకుండా ఉంటే ఓ పక్షి ఉందన్న సంగతి మీకు తెలుసా.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మాత్రమే జీవించే చాతక పక్షి గురించి చాలామందికి తెలియకపోవచ్చు.

ఇది మన దేశంలో ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. దీనిని అక్కడి స్థానికులు ఎక్కువగా చోళీ అని పిలుస్తుంటారు. ఉత్తరాఖాండ్ లోని ఎక్కువగా ఈ పక్షులు గర్వాల్ అనే ప్రాంతంలో నివసిస్తాయి. ఇక ఈ పక్షికి తాగమని నీళ్లు ఇచ్చినా.. నది లేదా చెరువు వద్దకు వెళ్లి ఉంచినా.. ఈ పక్షి నీళ్లను తాగదు.
ఇది నీరు తాగే సమయంలో ముక్కును..
మరి నీరు తగకుండా ఈ భూమిపై ఏ జీవి మనుగడ ఉండదు కదా.. మరి అది ఎలా బతుకుతుంది అనే అనుమానం మనకు కలగొచ్చు. పాయింట్ కి వస్తే.. అది నీరు తాగుతుంది.. ఎప్పుడంటే.. వర్షపు నీటిని మాత్రమే అది తాగుతుంది. ఇది నీరు తాగే సమయంలో ముక్కును తెరవదట. అది స్వాతి నక్షత్రంలో కురిసే నీటిని మాత్రమే తాగుతుందని స్థానికులు చెబుతుంటారు. అంతే కాదు దాని చూపు అంతా ఆకాశం వైపు మాత్రమే ఉంచుతుందట. ఇలా ఈ పక్షికి ఎంత దాహం వేసినా ఓర్చుకుంటుంది కానీ.. ఏ సరస్సుల్లో నీరు మాత్రం తాగదు. ఇక ఈ పక్షిని మార్వాడీలో మఘ్వా లేదా పాపియా అని కూడా అంటారట. భలే వింతగా ఉంది కదా.































