ఈ సమస్యతో బాధపడే వారు బీట్ రూట్ అసలు తినకూడదు..!

0
278

రక్తహీనత సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ తినడం వల్ల వారి శరీరంలో రక్తం వృద్ధి చెందుతుందని చెబుతుంటారు. ఎర్రటి రంగులో ఉండే ఈ బీట్ రూట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బీట్ రూట్ పచ్చిగా తినడం వల్ల అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అదే విధంగా వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల వెంటనే మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అందువల్ల క్రీడాకారులు ఎక్కువగా బీట్ రూట్ జ్యూస్ ను తాగుతుంటారు. ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ బీట్రూట్ ను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తినకూడదని చెబుతారు. అయితే వీటిని ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

బీట్ రూట్ లో మెగ్నీషియం, బయో ఫ్లేవనాయిడ్స్ చర్మ సౌందర్యం మెరుగు పడటానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వీటిని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బీట్ రూట్ లో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం అభివృద్ధి చెంది రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బీట్ రూట్ ను హెమో క్రొమోటోసిస్, వీసర్ వ్యాధితో బాధపడేవారు బీట్‌రూట్‌ను తినకూడదు.ఈ వ్యాధితో బాధపడే వారు బీట్ రూట్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం ఐరన్ నిల్వ ఉంటాయి. శరీరంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రం ఎరుపుగా రావడం వంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.అదేవిధంగా అధికరక్తపోటు సమస్యతో బాధపడే వారు బీట్ రూట్ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కానీ, రక్తపోటు సమస్యకు మందులు వాడే వారు బీట్ రూట్ తినడం వల్ల వారి శరీరంలో రక్తపోటు తక్కువ స్థాయిలోకి పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకోసమే రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్ తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.