బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ ఎట్టకేలకు 12 వారాలు పూర్తి చేసుకొని.. 13 వ వారంలోకి అడుగుపెట్టింది. 19 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. 13 వ వారం వచ్చేసరికి షణ్ముఖ్, సన్నీ, సిరి, ప్రియాంక, కాజల్, మానస్ మరియు శ్రీరామచంద్ర ఉన్నారు. ఇక ఈ 7 మందిలో షణ్ముఖ్, సన్నీ తప్ప మిగిలిన వారు నామినేషన్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సిరి, మానస్, శ్రీరామ చంద్ర, ప్రియాంక మరియు కాజల్ లో తక్కువగా ప్రియాంక సింగ్ కు ఓట్లు పోల్ అవున్నాయి. అన్ అఫిషియల్ ఓటింగ్ లో ఈ సారి ప్రియాంక సింగ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్ లో ఉన్న సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్ బాస్.
టికెట్ టు ఫినాలే టాస్క్ ను వాళ్లకు ఇచ్చాడు. దీనిలో మొత్తం మూడు ఛాలెంజ్ లు ఉంటాయి. మూడు ఆటల్లో ఎక్కువగా ఎవరు పాయింట్లు సాధిస్తారో వాళ్లు.. నేరుగా ఫైనల్ కు అడుగుపెడతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్’టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో సన్ని, సిరి మధ్య కాస్త గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. వాళ్లు ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లు కూడా సమాచారం అందుతోంది.
ఈ టాస్క్ తో మళ్లీ బిగ్ బాస్ టీఆర్ పీ రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ ల్లోకి ఎవరు అడుగుపెట్టారో తెలియాలంటే.. మరొక రోజు ఆగాల్సిందే. ఇక 12వ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ రవి విషయంలో ఇంకా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రవిని అన్యాయంగా బలి చేశారంటూ.. అతడి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
































