ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కీళ్లనొప్పుల సమస్య.వయసుతో తారతమ్యం లేకుండా అతి చిన్న వయస్సు నుంచి ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు గల కారణం ఎముకలలో క్యాల్షియం లోపం కావచ్చు.లేదా మారుతున్న మన ఆహారపు అలవాట్లు జీవన శైలి కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. అయితే ఒక్క సారిగా ఈ కీళ్లనొప్పుల బారిన పడితే వాటి నుంచి కోలుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ కీళ్ల నొప్పులకు ఎలాంటి మందులు వాడినా కేవలం కొంత సమయం వరకు మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి విముక్తి పొందడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటితోపాటు తాజా పండ్లు, కూరగాయలను వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న చోట వెల్లుల్లిరసంతో బాగా మర్దన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీలయినంతవరకు మాంసానికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. ఎక్కువగా చేపలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారపదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు సరైన ఆహారం తీసుకుంటూ శరీరానికి తగిన వ్యాయామాలు చేయడం ద్వారా కీళ్ల నొప్పులు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కీళ్లనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.































