Tanikella Bharani: తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలకు రచయితగా, ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఎంతోమంది నేను సెట్ లోకి వెళ్ళగానే ఒక కాలి పేపర్ ఇచ్చి నా డైలాగ్స్ నన్ను రాసుకోమని చెప్పేవారు.

రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఇది నాకు చాలా డిసడ్వాంటేజెస్ గా ఉండేదని,మరికొందరైతే దారుణంగా మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు సార్ అంటూ నా చేత డైలాగులు రాయించుకునే వారంటూ తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే అప్పట్లో రచయితలకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఈ సందర్భంగా ఈయన ప్రస్తావించారు.

అప్పట్లో రచయితలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను రచయిత గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నాకు కేవలం ఐదు వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారో అప్పుడే రచయితలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తనికెళ్ల భరణి వెల్లడించారు.
డైరెక్టర్లకు సమానంగా…
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం రచయితగా పని చేస్తే ఆయన డైరెక్టర్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రచయితలకు డైరెక్టర్లకు ఒకే ఈ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారని, రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తనికెళ్ళ భరణి వెల్లడించారు. అప్పట్లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రచయితలకు మంచి సంపాదన ఉంటుందని తనికెళ్ల భరణి వెల్లడించారు.































