‘పూజా హెగ్డే’ కి కరోనా పాజిటివ్..టెన్షన్ లో ఆ మూడు టీమ్ లు..!!

0
51

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోయింది.. సామాన్య ప్రజలతో పాటు సినీ సెలెబ్రిటీలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే’కి సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. అమ్మడికి కరోనా పాజిటివ్ అనే విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ ద్వారా పబ్లిక్ గా చాటి చెప్పింది. ఈ సందర్భంగా పూజా స్వయంగా మెసేజ్ కూడా పోస్ట్ చేస్తూ.. ‘అందరికీ హలో.. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేయదల్చుకున్నాను.కరోనా నిబంధనల్ని పాటిస్తూ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను.అయితే, కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. మీరు నాపై చూపుతున్న ప్రేమ, ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. అందరూ ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి’ అని పూజా హెగ్డే ఒక పోస్ట్ పెట్టింది. ఇక పూజాని కలిసిన వాళ్ళు ఎవ్వరో గానీ, మొత్తానికి వాళ్ళు కూడా ఇప్పుడు కరోనా బారిన పడే ప్రమాదం ఉంది.

పూజా అయితే ఆచార్య టీమ్ తోనే ఎక్కువుగా క్లోజ్ గా మూవ్ అయింది.ఏంటో పాపం ? ఆచార్య టీమ్ ను ఇప్పట్లో కరోనా వదిలేలా లేదు. అన్నట్టు పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్య షూట్ తో పాటు, రీసెంట్ గా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ షూట్ లో కూడా పాల్గొంది. అలాగే రాధేశ్యామ్ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఒక సాంగ్ షూట్ కోసం కూడా ఆ టీమ్ ను కలిసింది పూజా. మొత్తానికి పూజా హెగ్డే వల్ల ఇప్పుడు మూడు సినిమాల టీమ్ లకు కరోనా సోకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఆమె అభిమానులు పూజా త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో మెసేజెస్ పోస్ట్ చేస్తున్నారు. మరి వారి అభిమానం వల్లనైనా సరే పూజా త్వరగా కోలుకుంటుందేమో చూద్దాం. అన్నట్టు తమిళంలో విజయ్ 65వ చిత్రంలో పూజానే హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. కేవలం బాలీవుడ్ మూవీస్ కోసమే రెండేళ్ళు పాటు ముంబైలోనే మకాం వేసింది పూజా హెగ్డే.ఏది ఏమైనా ఎన్టీఆర్ తో అరవింద సమేత, బన్నీతో అల వైకుంఠపురంలో అంటూ వరుసగా రెండు సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న ఈ అమ్మడికి కరోనా అడ్డు కట్ట వేసిందనే చెప్పాలి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here