సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలమే ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ హీరోలకు కెరీర్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఎందుకంటే వాళ్లకి హీరోలుగా ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా చేసుకుంటూ సక్సెస్ సాధించుకుంటూ వీలైనంత వరకు అలాగే సినిమాలు చేసుకుంటూ దశాబ్దాలపాటు అగ్రహీరోలుగా కొనసాగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా లేదు ఎంత అగ్ర హీరోయిన్ అయినప్పటికీ వల్ల కెరియర్ అనేది దశాబ్దకాలం పాటు కొనసాగుతుంది తప్ప అంతకు మించి ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉండటం అంటే చాలా కష్టం అనే చెప్పాలి.

అయితే కొందరు మాత్రం ఒకటి.. అర సినిమాలతో సరిపెట్టుకునే వాళ్లు కూడా ఉన్నారు. అందంలోనూ, అభినయంలోనూ చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ ఒకటి అర సినిమాలతో మాత్రమే సరిపెట్టుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత అవకాశాలు లేక మళ్లీ ఇంకో సినిమాలో కనబడకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం…

అదితి ఆర్య
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఇజం సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తనకు హీరోయిన్ గా మంచి పేరు వచ్చినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. దాంతో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని చెప్పాలి. మరి ఒక్క సినిమాతోనే ఈమె కెరీర్ ముగిసిపోయింది అంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…

ముస్కాన్ సేతి
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ముస్కాన్ సేతి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. దాంతో ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు ఆతర్వాత ‘రాగల 24 గంటల్లో’ అనే త్రిల్లర్ మూవీ లో నటించినప్పటికీ అది కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. దాంతో ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి…

నిఖిషా పటేల్
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘కొమరం పులి’ సినిమా లో హీరోయిన్ గా నటించింది. నిఖిషా పటేల్ ఈ సినిమాలో తన అందంతో అభినయంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నప్పటికీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ అమ్మడుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఓం’ అనే సినిమాలో నటించినప్పటికీ అది కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఐరన్ లెగ్ ముద్ర వేసి అవకాశాలను ఇవ్వకుండా వదిలేశారు…

షహీన్
హీరోయిన్లుగా కెరీర్ ని ప్రారంభించిన వాళ్లు అందాన్ని అభినయాన్ని చూపినప్పటికీ సినిమాలు సక్సెస్ కాకపోతే వాళ్ళకి పెద్దగా అవకాశాలు రావు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు ఇచ్చి రామ్ ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ‘చిరునవ్వుతో’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన షహిన్ కి కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు అని చెప్పాలి. అయితే చిరునవ్వుతో సినిమా తమిళ్ రీమేక్ లో కూడా తనే హీరోయిన్ గా నటించింది కానీ తెలుగులో అంత పెద్ద విజయం సాధించిన కూడా చిరునవ్వుతో సినిమా తర్వాత ఆమెకి 1,2 సినిమాలకు మించి అవకాశాలు రాకపోవడం అనేది కొంచెం బాధకు గురి చేసే అంశం అనే చెప్పాలి…

మాళవిక శర్మ
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘నేల టికెట్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మాళవిక శర్మ మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంది. అయినప్పటికీ నేల టికెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఆవిడకు అవకాశాలు రాలేదు. అయినా కూడా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘రెడ్’ సినిమాలో హీరోయిన్ గా ఒక అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఈ అమ్మడుకు అవకాశం ఇచ్చే దర్శకుడు కరువయ్యాడు…


































