యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఒకప్పుడు సినిమాలంటేనే ఇష్టం లేదన్న అతడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు సినిమాలోకి రావడానికి కారణం.. అతడి కుటుంబ నేపథ్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో కృష్ణంరాజుకు మంచి గుర్తింపు ఉంది.

అతడి తోటి హీరోలతో పాటు పోటీ పడేవారు. అతడి జీవితంలో ‘భక్త కన్నప్ప’ సినిమా అనేది ఓ మైలు రాయి లాంటిది. ఇదిలా ఉండగా.. అతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో ఇండస్ట్రీకి తన వారసుడు రావాలనే కోరిక అలానే ఉండేదట. దీంతో తన తమ్ముడు సత్యనారాయణ రాజు కొడుకు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అతడికి మొదట్లో సినిమాలోకి రావడం అసలు ఇష్టం ఉండకపోయేది.
తన పెదనాన్న బలవంతం కారణంగానే అతడు ఇండస్ట్రీలోకి వచ్చాడట. మొదట ఈశ్వర్ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వర్షం, చత్రపతి ఇలా పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ట్రెండ్ ను సెట్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజు క్రితం తన నాన్న సత్యనారాయణ రాజు చనిపోవడంతో.. ప్రభాస్ వాళ్ల అమ్మ ఒంటరిగా ఉంటూ తీవ్ర అనారోగ్యానికి గురయింది.
దీంతో తన ఫ్యామిలీని తన పెదనాన్న ఇంటి వద్దకు మార్చేశాడు ప్రభాస్. తన తల్లికి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ తన ఇంటికి తెచ్చుకున్నారు. రెండు ఫ్యామిలీలు విడివిడిగా ఉండటం ఎందుకని.. కృష్ణంరాజు పక్కపక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. దీంతో తన పెదనాన్నతోనే ప్రభాస్ వాళ్ల కుటుంబం ఉంటోంది.































