సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో, తన తీయనైన గాత్రంతో ఎన్నో వందల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే నిజ జీవితంలో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తున్న సునీత గురించి ఎందరో ఎన్నో వార్తలు రాసేవారు. సునీతకు ఎవరితోనో లింకులు ఉన్నాయంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. అయితే ఎప్పుడూ కూడా సునీత వాటిపై స్పందించలేదు.

ఈ క్రమంలోనే సునీత పై వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ మాత్రమే కాకుండా తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తన స్నేహితుడిని రెండవ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే రెండవ పెళ్లి చేసుకున్న కూడా సునీత పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సునీత స్పందిస్తూ గతంలో తనపై వచ్చిన రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే సునీత స్పందిస్తూ తనపై ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ తన కుటుంబ సభ్యులు, తన వాళ్లు ఎప్పుడు వాటిని నమ్మి తనని ప్రశ్నించలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే వారికి నా గురించి తెలుసు కనుక వారి ఎప్పుడు ఇలాంటి విషయాలలో నన్ను ప్రశ్నించలేదని ఈమె తెలియజేశారు. ఒకవేళ ఇలాంటి విషయాలు మాట్లాడినా కూడా కొందరి ఎదవలు ఎప్పటికీ మారరు.. ఇలాగే రాస్తూ ఉంటారని వాళ్లు చెప్పే వారిని సునీత తెలియజేశారు.
కానీ ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే సునీత వారితో కలిసింది కారణం అదేనా అంటూ వార్తలు రాసేవారు. ఆ వార్తలు చూసినప్పుడు ఓహో నా గురించి ఇలా అనుకుంటున్నారా? అని వదిలేసాను కానీ ఎప్పుడు వాటిపై స్పందించలేదని, అలాంటి వాటిపై స్పందించక పోవడం మంచిదని సునీత ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ప్రస్తుతం రెండవ పెళ్లి తర్వాత సునీత జీవితం ఎంతో సంతోషంగా ఉందని చెప్పవచ్చు.
































