గత నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పదవిలో ఘోర పరాజయం పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్స్ లోతుగా పరిశీలించిన ట్విట్టర్ తన ఖాతాను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా హింసను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తన అకౌంట్ ను శాశ్వతంగా నిలిపివేశామని ట్విట్టర్ తాజాగా తన నిర్ణయాన్ని బ్లాక్ పోస్టులు వివరించింది.

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై విసిగిపోయిన అమెరికా ప్రజలు ఈసారి ఎన్నికలలో అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ను తొలగించి డెమోక్రటిక్ పార్టీ అధినేత జోబైడెన్‌ కు కట్టబెట్టిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జోబైడెన్‌ ఎన్నికలను ధృవీకరించడానికి ఇటీవల అమెరికా కాంగ్రెస్ క్యాపిటల్ భవననంలో సమావేశం ఏర్పాటు చేశారు.అయితే ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేయడంతో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో నలుగురు ప్రాణాలను పోగొట్టుకున్నారు.

ఈ విధంగా ట్రంప్ తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనంపై దాడి చేయడంతో వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా ఘర్షణ కు సంబంధించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడమే కాకుండా “ఐ లవ్ యు” అంటూ తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టారు. ట్రంప్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ డిలీట్ చేశాయి. అంతే కాకుండా ట్విట్టర్ ట్రంప్ ఖాతాను12 గంటలపాటు లాక్ చేశాయి. ఈ విధంగా హింసను ప్రేరేపించే ట్వీట్లు పెట్టడం వల్ల తన ఖాతాను నిషేధించే అవకాశాలు ఉంటాయని ట్విట్టర్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ తన మద్దతుదారుల ద్వారా చేసిన తిరుగుబాటుకు ఎంతోమంది నిరసన తెలుపుతూ ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ జాక్‌ డోర్సేకు అనేక మందల మంది ఉద్యోగులు లేఖలు రాయడంతో ఫిట్టర్ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here