కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స చెయ్యండి.. కేంద్రం!

0
276

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే కరోనా లక్షణాలు బయట పడిన తర్వాత నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడటంలో ఎంతోమంది చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌ అని నిర్ధారణ అయితేనే చికిత్సకు చేర్చుకుంటామని పలు ఆసుపత్రిలో తెలియజేస్తున్నాయి. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది.

జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలు కనబడితే నిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడకుండా వెంటనే వారికి సరైన చికిత్స అందించాలని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టుల్లో స్వల్ప లక్షణాలు ఉంటే వారికి నెగిటివ్ అనే రిపోర్ట్ వస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వారికి కూడా చికిత్స అందించే విషయంలో ఆరోగ్యశాఖ కొంతమంది నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కొందరికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, అది కరోనా కాదని కొందరు నిర్లక్ష్యం వల్ల ప్రమాదంలో పడుతున్నారు. మరికొందరు లక్షణాలు కనిపించగానే నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడటం వల్ల వ్యాధి తీవ్రత అధికమయ్యే ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా లక్షణాలు కనిపించగానే ఫలితాల కోసం ఎదురు చూడకుండా వెంటనే వారికి చికిత్స అందించాలి. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉండాలి. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారికి వారి పరిస్థితి విషమిన్చినట్లు అనిపిస్తే వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదేశాలను జారీ చేసింది.