Upasana: పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన… ఇకపై వారందరికీ ఉచితంగా వైద్యం!

0
85

Upasana: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఈమె కుటుంబ పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు.ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తనకు మంచి మనసు చాటుకుంటున్నారు.

ఇప్పటికే ఎంతోమందికి అపోలో ద్వారా ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నటువంటి ఉపాసన తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఉపాసన పాపకు జన్మనిచ్చిన తర్వాత మొదటిసారి అపోలో హాస్పిటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈమె హాజరయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న అపోలో చిల్డ్రన్ బ్రాండ్ ను ఉపాసన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ తాను డెలివరీ సమయంలో తనకు ఎంతోమంది తమ ప్రేమ ఆశీర్వాదాలు పంచారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అంతే విధంగా ఎవరైతే ఒంటరి మహిళలు తమ పిల్లల ఆరోగ్య విషయంలో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ ఈమె శుభవార్త తెలిపారు. ఇలా ఒంటరి మహిళలు తమ పిల్లల ఆరోగ్య విషయంలో ఇకపై బాధపడాల్సిన పనిలేదని తెలిపారు.

Upasana: గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన…


ఇలాంటి పిల్లలు ఇకపై అపోలోలో ప్రతివారం ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చని ఈమె తెలిపారు. ఇలా ఒంటరి మహిళలు తమ పిల్లలకు ప్రతి వారం ఉచితంగా వైద్య సేవలను అందించబోతున్నామని ఇకపై ఆ వారందరి బాధ్యత మాదే అంటూ ఈ సందర్భంగా ఉపాసన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇలా ఉపాసన గొప్ప నిర్ణయం తీసుకోవడంతో మెగా కోడలి మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.