Urvashi Rautela: సినీ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ఊర్వశీ రౌతేల ఒకరు. ఈమె ఇటీవల వరుస సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలో కూడా దబిడి దిబిడి అనే పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంది. ఈ విజయంతో ఊర్వశికి తెలుగులో మరిన్ని చాన్సులు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా గతంలో ఈమె బాత్రూం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పట్లో ఈ వీడియో కాస్త సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ వీడియో గురించి ఊర్వశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2022లో ఘుస్పైతియే సినిమా విడుదలకు ముందు ఆమె బాత్రూమ్ వీడియో విడుదల కావడంతో పెద్ద ఎత్తున చర్చలకు కూడా కారణమైంది.
తాజాగా ఈ వీడియో గురించి ఊర్వశి మాట్లాడుతూ… తాను ఘుస్పైతియే సినిమాలో నటించిన వీడియోని బయటకు లీక్ చేసామని తెలిపారు. ఈ సినిమా నిర్మాతలు విడుదలకు ముందు నా వద్దకు వచ్చే సినిమాపై ఏమాత్రం బజ్ లేదని ఎంతో ఆవేదన చెందారు. సినిమాపై హైప్ పెంచాలి అంటే ఆ వీడియో లీక్ చేయాలి అంటూ నన్ను కోరారు. దీంతో నిర్మాతల బాధ చూడలేక వారి కోసమే ఆ వీడియోని విడుదల చేశామని తెలిపారు.
ఇక ఈ వీడియో విడుదల చేయడంలో తప్ప ఏమీ లేదు. ఆ సినిమాలో నేను నటించాను అదే వీడియోని బయటకు విడుదల చేశారు. నా దృష్టిలో అది తప్పు కాదు, ఎందుకంటే నిర్మాతలు సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. నేను ఒక సన్నివేషంలో మాత్రమే నటించాను నా దృష్టిలో అది ఒక సీన్ అంతే. అయితే దీనిని వివాదం చేయటానికి పెద్దగా ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇక ఈ వీడియో బయటకు రావడంతో మహిళలు సురక్షితంగా ఉండాలని ఒక సందేశాన్ని కూడా ఇవ్వగలిగాం అంటూ ఊర్వశి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























