Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఈమె సమయం చూసి ఓ క్రికెటర్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిప్పుడే ఇండియన్ క్రికెట్ టీం లో అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నారు క్రికెటర్ రిషబ్ పంత్.

ఇలా సమయం చూసి ఊర్వశి రిషబ్ పంత్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ ఈమె చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రిషబ్ పంత్ పేరు ప్రస్తావించకుండా ఆర్పి అంటూ తన గురించి వెల్లడించారు.

ఈ విధంగా నటి ఊర్వశి క్రికెటర్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ వీడియో క్రికెటర్ రిషబ్ పంత్ స్పందిస్తూ నటి ఊర్వశి పేరు ప్రస్తావించకుండా అక్క నన్ను వదిలేయ్ అంటూ ఈమెపై పరోక్షంగా దాడి చేశారు.ఊర్వశి పేరు బయటకు చెప్పకుండా అక్క అంటూనే కొందరు వారికి పబ్లిసిటీ కోసం మరికొందరి పేర్లను వాడుకుంటూ ఉన్నవి లేనట్టు చెబుతుంటారు అని ఈయన పరోక్షంగా ఆమె వీడియో పై స్పందిస్తూ కౌంటర్ వేశారు.

Urvashi Rautela: అక్క అని సంబోధించిన క్రికెటర్..
మొత్తానికి క్రికెటర్ రిషబ్ పంత్ అక్క అంటూ కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అయితే నటి ఊర్వశి కేవలం తన పబ్లిసిటీ కోసమే తన పేరును ఉపయోగిస్తుంది అంటూ పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఈయన ఊర్వశి వీడియో పై స్పందిస్తూ తనకు భారీ కౌంటర్ వేశారని పలువురు భావిస్తున్నారు.
Urvashi speaking about Rishabh Pant ????#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl
— Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022



























