టిక్ టాక్ బ్యాన్ ఎత్తివేత.. కాకపోతే మరో ట్విస్ట్!

0
106

గతంలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ భద్రత కోసం చైనా దేశం రూపొందించిన యాప్స్ టిక్ టాక్, వి చాట్ వంటి వాటి పై నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. అమెరికా దేశ భద్రత దృష్ట్యా అమెరికా సమాచారం చైనా వారికితెలియకుండా అమెరికా దేశ భద్రతకు భంగం కలిగించకుండా ఉండడం కోసమే డోనాల్డ్ ట్రంప్ ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకొని రద్దు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అమెరికా తాజా అధ్యక్షుడు జో బైడెన్ డోనాల్డ్ ట్రంప్ నిషేధాన్ని బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ క్రమంలోనే జాతీయ భద్రతకు, అమెరికా సమాచారాన్ని గోప్యతకు ముప్పు కలిగించే శత్రువులతో వీటికి సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు తెలియజేశారు.

అదేవిధంగా ఈ యాప్ ల కార్యకలాపాలను,అమెరికా జాతీయ భద్రతా నష్టాలను నిర్ణయించడం కోసం ఒక కొత్త టీమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇవి చైనా వంటి ఇతర విదేశీయుల ప్రత్యర్థుల ప్రభుత్వాలకు లేదా మిలటరీ లకు అనుసంధానమై ఉండి అమెరికా వినియోగదారుల డేటాను సేకరిస్తున్నాయా లేదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని తెలిపారు.

అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే చైనా ప్రభుత్వం చూస్తోందని,టిక్ టాక్, వీ చాట్ వంటి యాప్స్ ద్వారా అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యునిస్ట్ ప్రభుత్వానికి అందిస్తున్నాయని ఆరోపణలు రావడంతోనే డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీటిని నిషేధించింది. ఈ విధంగా డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు నిషేధం విధించింది.ఈ క్రమంలోనే ట్రంప్ కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా తమ యాప్స్ స్ బ్యాన్ చేశారని టిక్ టాక్ పేర్కొంది. అయితే తాజాగా ఈ యాప్స్ పై నిషేధాన్ని ఎత్తి వేసినట్లు అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here