భారత ప్రజలకు శుభవార్త.. కరోనా కష్టాలు తీరినట్టే..?

0
148

ఎన్నో రోజుల నుంచి ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూసున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటకు వెళ్లామంటే ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది వ్యాక్సిన్ విషయంలో శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రకటనలు ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే ప్రముఖ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రజలకు తాజాగా ఒక శుభవార్త చెప్పింది.

త్వరలో 30 కోట్ల మంది ప్రజలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కీలక ప్రకటన చేసింది. సీరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. డీసీజీఐ నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి లైసెన్స్ రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఐదు రకాల వ్యాక్సిన్లను ఉపయోగించి సీరం సంస్థ ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను నిర్వహిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ప్రజలకు 2021 సంవత్సరం మార్చి నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమ సంస్థకు ఉందని సీరం సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. కేంద్రం మొదట వయోధికులు, పారిశుధ్య కార్మికులు, సిబ్బంది, పోలీసులకు వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

దేశంలోని జనాభాలో 23 శాతం మందికి మాత్రమే తొలి దశలో వ్యాక్సిన్ దక్కనుందని తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా, సీరం సంస్థ వ్యాక్సిన్లు వేగంగా క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంటున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి వారానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here