Varalakshmi Sarathkumar: కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా సమంత నటించిన యశోద సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి సందడి చేశారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ చిన్నప్పుడు తనపై లైంగికంగా దాడి జరిగిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా తనపట్ల జరిగిన లైంగిక దాడి గురించి తెలియజేయడమే కాకుండా తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్ అధినేత తన పక్కన పడుకోవాలని తనని హెచ్చరించారని అతను అలా అడిగిన వెంటనే పోరా పోరంబోకు అని గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.
వరలక్ష్మి శరత్ కుమార్ ఒక స్టార్ హీరో వారసురాలు అయినప్పటికీ ఈమెకు కూడా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి వేధింపులు తప్ప లేదని తెలుస్తుంది. ఇకపోతే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి వెళ్తానని చెప్పగానే అందుకు శరత్ కుమార్ ఏ మాత్రం ఒప్పుకోలేదని తెలిపారు.ఇక తన తల్లి రాధికతో కలిసి బలవంతంగా ఈమె శరత్ కుమార్ ను ఒప్పించినట్టు తెలిపారు.

Varalakshmi Sarathkumar: ఎన్జీవో సమస్తను నిర్వహిస్తున్న నటి…
ఇలా సినిమాలలో విలన్ పాత్రలలో మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా మూగజీవాల పట్ల కూడా ఈమె ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వేల మూగజీవాలకు ఆహారాన్ని అందించడమే కాకుండా, మానసికంగా బాధపడే వారికి తన సంస్థ ద్వారా అండగా నిలుస్తూ తన మంచి మనసు చాటుకున్నారు.

































