ఉదయ కిరణ్, తరుణ్ లతో నన్ను పోల్చకండి.. వరుణ్ సందేశ్

0
447

టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని యువతరంలో క్రేజ్ వున్న హీరోగా వరుస అవకాశాలను కొల్లగొట్టాడు. తర్వాత వచ్చిన మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా,ఏమైంది ఈ వేళ,బ్రహ్మిగాడి కథ, డి ఫర్ దోపిడి వంటి డజను సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత విజయం సొంతం చేసుకోలేక పోయాడు.

అవకాశాల్లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమయంలో వరుణ్ సందేశ్ బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తర్వాత వరుణ్ సందేశ్ రీఎంట్రీ మూవీగా “ఇందువదన” సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‏కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్లో వరుణ్ సందేశ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా యాంకర్ వరుణ్ సందేశంను మీ కెరీర్ కూడా తరుణ్, ఉదయ్ కిరణ్ లాగా మొదట్లో మంచి అవకాశాలు అందుకున్నారు. తర్వాత వెనుకబడి పోయారని అడగగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. వారిద్దరితో తనను పోల్చవద్దని చెప్పాడు. ఉదయ్ కిరణ్, తరుణ్ నాకు బాగా తెలుసు. ఉదయ్ కిరణ్ అలా చేసుకోవడం నాకు చాలా బాధేసింది. ప్రస్తుతం నాకు చాలా అవకాశాలే వస్తున్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ చేశాను. అయితే కరోనా కారణంగా అవి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంటూ తన మనసులోని మాటలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.