Varun tej -Lavanya Tripati: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసిందే. ఈమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారో అయితే తాజాగా వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ నటిస్తున్నటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం మక్కా సినిమా కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్లకు భారీ బడ్జెట్ అవుతుందన్న కారణంతో ఈ సినిమా షూటింగ్ పనులను నిలిపివేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఇక మట్కా సినిమా గురించి ఇలాంటి వార్తలు రావడం ఆలస్యం వెంటనే కొందరు లావణ్య త్రిపాటి పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. లావణ్య త్రిపాఠి మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన వేల విశేషం ఏంటో వరుణ్ తేజ సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో వరుణ్ తేజ్ వెంటనే తన భార్యపై వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలను నిలిపివేయడం కోసం మట్కా టీంతో కలిసి ఈ సినిమా అప్డేట్ ఇప్పించారు.
లావణ్య ఐరన్ లెగ్..
పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇలా టీం ఈ సినిమా అప్డేట్ ఇవ్వడంతో లావణ్య గురించి వస్తున్నటువంటి వార్తలకు కూడా చెక్ పెట్టినట్టు అయింది.































