Varun Tej: అందుకే మా ప్రేమ విషయం బయట పెట్టలేదు… లవ్ సీక్రెట్ రివీల్ చేసిన వరుణ్ తేజ్!

0
32

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి ఈయనకు వీరి ప్రేమ గురించి కూడా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

లావణ్య త్రిపాఠి తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి ప్రేమ గురించి ఇంట్లో పెద్దలకు చెప్పి అనంతరం వీరిద్దరూ ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలోనే వీరిద్దరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తమ ప్రేమ విషయం గురించి వెల్లడించారు.

నేను లావణ్య ఇద్దరం మంచి స్నేహితులు.అయితే మా ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు అభిరుచులు కలవడంతో మా జీవితాన్ని ముందుకు కొనసాగించాలని అనుకున్నాము. అయితే లావణ్యకు నేను ముందుగా ప్రపోజ్ చేశానని వరుణ్ తేజ్ తెలిపారు. నాకు ఎప్పుడు ఏది అవసరమో లావణ్యకు బాగా తెలుసు. లావణ్య చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందని వరుణ్ తెలిపారు. తను నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారని ఈయన తెలియచేశారు.

Varun Tej: ముందుగా నేనే ప్రపోజ్ చేశాను…


ఇలా మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో మా రెండు కుటుంబాలు ఎవరూ కూడా మా ప్రేమకు అడ్డు చెప్పలేదు మా నిర్ణయాలను గౌరవించి పెళ్లికి ఒప్పుకున్నారని తెలిపారు.ఇక మా ప్రేమ విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టడానికి కారణం ఏమీ లేదు తన పర్సనల్ విషయాలను పర్సనల్ గా ఉంచాలని అనుకుంటాను అందుకే ఈ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదని తెలిపారు. ఇక ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా చేసుకున్నామని పెళ్లి కూడా అలాగే సింపుల్ గా చేసుకోబోతున్నాము అంటూ వరుణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.