సినిమాలో యాక్షన్ థ్రిల్లర్స్ చూడటానికి చాలా బాగా ఉంటాయి. కానీ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి. ఎందుకంటే వాటి కోసం వాళ్లు పడే శ్రమ అంతా ఇంత కాదు.. తమ బాడీలను.. యాటీట్యూడ్.. ఇలా ప్రతిదానిలో మార్పులు చేస్తుంటారు. పాత్రకు తగ్గట్టుగా తమను తాము మార్పుకోవడం.. శరీరాకృతిని మార్చుకోవడం కోసం హీరోలు ఎంతో పట్టుదలతో శ్రమిస్తుంటారు.

ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. గనీ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు.
ఇప్పటికే ఈ హీరో.. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. అలాగే ఎప్పటికప్పుడూ జిమ్లో కఠోరమైన వ్యాయమాలు చేస్తున్నాడు. ఇలా వరుణ్ తేజ్ జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాక్ లుక్ లో తీసిన ఈ వీడియోలో వరుణ్ పుల్ అప్స్ తీస్తూ కనిపిస్తున్నాడు. హార్డ్ వర్క్ కు బ్యాక్ అప్ లుండవు అంటూ వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక ఈమూవీకి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ త్వరలోనే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ముఖం చూపించకుండా బ్యాక్ సైడ్ తోనే వారెవ్వా అనిపించాడు ఈ ప్రిన్స్ వరుణ్ తేజ్. మంజ్రేకర్ హీరోయిన్ కాగా సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
































