Connect with us

Featured

Vignesh Shivan: నయన్ తో విఘ్నేష్ ప్రేమ… కుక్కకు బిర్యాని దొరికిందంటూ ?

Published

on

Vignesh Shivan: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి ప్రస్తుతం ఈమె తన పిల్లలతో కలిసి తన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇటీవల నయనతార తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈ డాక్యుమెంటరీ లో భాగంగా నయనతారతో ప్రేమలో పడటం గురించి డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ మాట్లాడుతూ నయనతారతో మొదటిసారి పరిచయమైన తర్వాతనే ఆమెతో ప్రేమలో పడ్డానని తెలిపారు అయితే మా ప్రేమ విషయం కొంతకాలం పాటు చాలా రహస్యంగా ఉంచాము. ఎప్పుడైతే మా ప్రేమ విషయం బయటపడిందో అప్పుడు చాలామంది మా జోడిని యాక్సెప్ట్ చేయలేకపోయారు.

ఈ క్రమంలోనే మా ప్రేమ విషయం తెలియగానే ఒక మీమ్ వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. ఒక అందమైన అమ్మాయి వెళ్లి బీస్ట్‌లాంటి వాడిని లవ్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారంటూ ఆ మీమ్‌లో ఉందని తెలిపాడు. అయితే ఆ మీమ్‌లో కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నట్టు ఉందని తెలిపారు. ఇలాంటి పోస్టులు చూసి నేను నయనతార చాలా బాధపడ్డామని తెలిపారు..

Vignesh Shivan: జీవితంలో ఏదీ తొందరగా దొరకదు..


మొదట్లో మా జోడిని చాలామంది యాక్సెప్ట్ చేయలేక భారీగా ట్రోల్స్ చేసేవారు క్రమక్రమంగా మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారని విఘ్నేష్ తెలిపారు.బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యారు అంటూ రజినీకాంత్ ఉదాహరణను గుర్తుచేస్తూ మన జీవితంలో ఏదీ అంత తేలికగా దొరకదని అన్నాడు. ఆ ట్రోల్స్ చూసి అప్పట్లో తాను లైట్ తీసుకున్న నయన్ మాత్రం చాలా బాధపడిందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Featured

Ambanti: హోం మంత్రి అనిత కులం పై అంబంటి  సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదంటూ?

Published

on

Ambanti: ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కులం పట్ల మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా పార్టీ కార్యకర్తలు చేసిన పోస్టులను పరిగణలోకి తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అంబంటి రాంబాబు తెలిపారు. అనిత గారి కులం ఏంటి అనేది మాకు ఇప్పటివరకు తెలియదు.

Advertisement

ఈమె ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే తాను పక్కా క్రిస్టియన్ అని తెలిపారు. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా నా కారులో బైబిల్ ఉంటుంది అలాగే నా హ్యాండ్ బ్యాగ్ లో కూడా బైబిల్ ఉంటుందని తెలిపారు.. ప్రస్తుతం హోం మంత్రిగా అధికారంలో ఉన్న తర్వాత ఈమె హిందువుగా చలామణి అవుతూ తిరుపతి ఆలయానికి కూడా వెళ్తున్నారని రాంబాబు తెలిపారు..

మరి ఈమె హిందువా క్రిస్టియనా అనే సంగతి మాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన పయత్నాలు చేస్తున్నారని అంబంటి ఫైర్ అయ్యారు. పాపం హోమ్ మంత్రి చేతిలో ఏమీ ఉండదని అంత నారా లోకేష్ నడిపిస్తున్నారని ఈయన మండిపడ్డారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి నారా లోకేష్ అయ్యన్నపాత్రుడు అచ్చం నాయుడు అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడటమే కాకుండా సంచలనమైనటువంటి ట్వీట్ కూడా చేశారు ఈ విషయంపై మేము ఫిర్యాదులు కూడా చేశాము.

Ambanti:

ఇలా నారా లోకేష్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈయన డిమాండ్ చేశారు.వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని… న్యాయపరంగా పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అంబంటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

AP Politics: వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్… ఇక వాలంటీర్లు లేనట్టేనా?

Published

on

AP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమిచ్చి, ఆ ఇంటికి అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటిని వాలంటీర్ సహాయం ద్వారా అందజేశారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి.

Advertisement

ఇలా వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా 5000 రూపాయలు చెల్లించారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్ష నేత ఆయన చంద్రబాబు నాయుడు పూర్తిగా తప్పు పట్టారు. వాలంటీర్ ఉద్యోగం అంటే గోన సంచలు మోసే ఉద్యోగం అని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కూడా వాలంటీర్ వ్యవస్థ పై మండిపడ్డారు.

ఇలా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు తాజాగా శాసనమండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Politics: వాలంటీర్ వ్యవస్థ లేదు..


గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తద్వారా 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ఈయన తెలిపారు. వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వైసిపి తమని నమ్ముకున్న ప్రజలు అలాగే కార్యకర్తలను పూర్తిగా మోసం చేసింది అంటూ బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Upasana: నా భర్త దర్గాకు వెళ్తే తప్పేంటి.. రామ్ చరణ్ కు మద్దతుగా నిలిచిన ఉపాసన?

Published

on

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల అయ్యప్ప మాల ధరించి కడప అమీన్ పీర్ దర్గాకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది హిందూ సంఘాలు అయ్యప్ప మాల ధరించి రామ్ చరణ్ దర్గాకు వెళ్లడాన్ని పూర్తిగా తప్పు పట్టారు.

Advertisement

దర్గా అంటే ఓ సమాధి ఇలా అయ్యప్ప మాల ధరించి సమాజ దగ్గరకు వెళ్లడం ఏంటి అంటూ ఈయన వ్యవహరి శైలిని పూర్తిస్థాయిలో విమర్శించారు. అయితే రామ్ చరణ్ దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ విషయంలో రామ్ చరణ్ పట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి ఉపాసన ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తన భర్తకు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా ఉపాసనకు నెటిజన్ ఉపాసనని ట్యాగ్ చేస్తూ..మేడమ్ ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలోని వారి దర్గాకు వెళ్లడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానించకుండా మరియు మన మతంలో జోక్యం చేసుకోకుండా వారు చేసే వాటిని గౌరవించడం ద్వారానే మతాన్ని గౌరవించుకోగలుగుతాం అంటూ ట్వీట్ చేసింది.


Upasana:వన్ నేషన్ వన్ స్పిరిట్..

ఇక ఈ పోస్టుకు ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా దర్గాలో చరణ్ దర్శించుకుంటున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ..విశ్వాసం ఏకం చేస్తుంది, అది ఎప్పటికీ విడిపోదు. భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము.. మన బలం ఐక్యతలోనే ఉంది. ఎల్లప్పుడూ రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు.. వన్ నేషన్ వన్ స్పిరిట్.. జైహింద్ అంటూ చరణ్ దర్గాలో ఉన్న ఫోటోని షేర్ చేయడమే కాకుండా దర్గాకు వెళ్తే తప్పు లేదని కూడా ఈమె తన భర్తకు మద్దతుగా నిలిచారు.

https://x.com/upasanakonidela/status/1858901126592295291?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1858901126592295291%7Ctwgr%5E6c137d2468fb6f5b2182d3873ac5dcff3645b6da%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fv6velugunews-epaper-dhcaf3d89291ec43cc96b01ba37167d042%2Fmaaayanadargaakuvelitetappentibhartakumaddatugaupaasanapost-newsid-n639984035

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!