Vijay Devarakonda:విజయ్ దేవరకొండ సినిమాలపై ఆసక్తితో డిగ్రీ పూర్తి చేసుకుని ఒక యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ తీసుకుంటూ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు అయితే తనకు హీరో గానే అవకాశాలు కావాలని ఈయన ఎప్పుడు ఆకాంక్షించలేదు వచ్చిన పాత్రలని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన గతంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఈయన నటించిన పాత్ర అందరిని ఆకట్టుకుంది దీంతో తరుణ్ భాస్కర్ తనకు పెళ్లిచూపులు సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. అయితే విజయ్ ని నమ్మి ఎవరూ కూడా ఆ సినిమాని నిర్మించడానికి ఆసక్తి చూపలేదు.
చివరికి నిర్మాత రాజ్ కందుకూరి విజయ్ ని నమ్మి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారడం గురించి ఆయన పలు విషయాలను వెల్లడించారు.

Vijay Devarakonda: నిర్మాణరంగంలో అడుగుపెట్టిన విజయ్…
నన్ను నమ్మి కొందరు నిర్మాతలు నాతో కనక సినిమాలు చేయకపోతే ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదని నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నన్ను మొదట్లో ప్రోత్సహించిన నిర్మాతలే కారణమంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన నిర్మాతల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన హీరోగా నిర్మాతగా మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.