Vijay Sai Reddy: తారక రత్న ఆరోగ్య విషయంలో బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి…?

0
85

Vijay Sai Reddy: నందమూరి వారసుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండె పోటుతో అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్నటి వరకు అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవటంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన పెరిగిపోయింది. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఇక ఆయన ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించాడు.

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల పరామర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కూతురు అలేఖ్యరెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నాడు. ఇలా నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డికి బంధుత్వం ఏర్పడింది. అయితే అలేఖ్యరెడ్డిని తారకరత్న వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబంలో విభేదాలు మొదలై తారకరత్నని దూరం పెట్టారు. వీరి వివాహం తర్వాత కొంతకాలానికి మళ్లీ కుటుంబ సభ్యులందరూ కలిసిపోయారు.

ఇక ఇటీవల పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అనారోగ్యం పాలవటంతో స్వయంగా బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్న ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవల విజయసాయిరెడ్డి బెంగళూరుకు చేరుకొని డాక్టర్లను సంప్రదించి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలియజేశారు.

Vijay Sai Reddy: కోలుకుంటున్న తారకరత్న…

తారకరత్న గుండె పనితీరు మెరుగు పడటమే కాకుండా రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుందని, తొందర్లోనే తారకరత్న కోలుకుంటాడని విజయసాయిరెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా తారకరత్నకు దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకుంటున్న బాలకృష్ణకు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశాడు.