టోక్యో లో జరగనున్న ఒలింపిక్స్ బెర్త్ కన్ఫాం చేసుకున్నాడు విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్. పూణేలో నిర్వహించిన ఫైనల్ ట్రైల్స్ లో 70మీ. ర్యాంకింగ్ లో 2880 పాయింట్లకు 2677 పాయింట్లు సాధించి రెండవ ర్యాంకర్ గా నిలిచాడు.

మరో ఆర్చర్ జయంత్ తో ధీరజ్ స్కోరు టై అయింది. ఆ తరువాత వీరిద్దరికీ నిర్వహించిన పోటీలో ధీరజ్ 3-1 తేడాతో విజయం సాధించాడు. దీంతో ఒలింపిక్స్ కు తన బెర్త్ ఖరారు చేసుకున్నాడు తెలుగుతేజం ధీరజ్. ఒలింపిక్స్ లో భారత్ తరుపున ఆర్చరీ విభాగంలో ప్రాతినిధ్యం వహించేందుకు ఆర్హత సాధించాడు.































