వైరల్ : లీకైన” ఆచార్య” టెంపుల్ టౌన్ వీడియో!

0
734

టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయినా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా నిర్మాణ పనులను జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ టెంపుల్ టౌన్ సృష్టించాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా లేని అతిపెద్ద టెంపుల్ టౌన్ ఆచార్య సినిమాలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. అయితే ఈ టెంపుల్ టౌన్ గాలి గోపురానికి సంబంధించిన వీడియోను హీరో చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ గా 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో అద్భుతంగా మలిచి గాలి గోపురాన్ని క్రియేట్ చేశారు. ఈ విధంగా క్రియేట్ చేయడం కళా దర్శకత్వం ప్రతిభకే ఓ మచ్చుతునక. నాకెంతో ముచ్చట అనిపించి ఈ గాలి గోపురాన్ని నా కెమెరాలో బంధించి.. మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా? అనేంతగా ఈ టెంపుల్ ను డిజైన్ చేసిన కళాదర్శకుడు సురేష్ ను, టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివను, ఈ టెంపుల్ టౌన్ నిర్మించడానికి కావలసినవి సమకూర్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిరంజీవి ఈ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో మెగా వారసుడు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఆచార్య సినిమాలో ప్రముఖ బాలీవుడ్ ప్రతి నాయకుడు అయిన సోనుసూద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొందరలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here