Viral Video: సాధారణంగా బంగారు షాపులలో దొంగతనాలు జరగడం గురించి మనం వింటూనే ఉంటాం అయితే ఎంతో విలువైన ఆభరణాలు ఉన్నటువంటి ఆ షాపుకు సిబ్బంది ఎన్నో భద్రత చర్యలు చేపట్టినప్పటికీ కొన్నిసార్లు దొంగతనాలు జరగడం లేదంటే బంగారు నగలు కొనడానికి వచ్చినటువంటి కస్టమర్లు తమ చేతివాటం చూపించడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ఈ విధంగా ఇప్పటికే ఇలాంటి దొంగతనాలు గురించి మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఎలుకలు దొంగతనం చేయడం విన్నారా…వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఓ నగల దుకాణంలో ఎలుక ఏకంగా ఖరీదైన డైమండ్ నెక్లెస్ దొంగతనం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. బహుశా ఆ ఎలుక తనభార్యకు లేదా తన గర్ల్ ఫ్రెండ్ కోసం డైమండ్ నెక్లెస్ దొంగతనం చేసి ఉంటుంది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే భర్త పరిస్థితి అయిన ఆ ఎలుక పరిస్థితి అయిన రెండు ఒకటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: చాకచక్యంగా దొంగతనం చేసిన ఎలుక…
ప్రస్తుతం ఈ ఎలుక చోరీ చేసినటువంటి వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయం తెలియదు కానీ ఈ వీడియో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఎలుక ఎలా దొంగతనం చేసిందో ఓ లుక్ వేసేయండి.
#अब ये चूहा डायमंड का नेकलेस किसके लिए ले गया होगा…. 🤣🤣 pic.twitter.com/dkqOAG0erB
— Rajesh Hingankar IPS (@RajeshHinganka2) January 28, 2023