సోషల్ మీడియాలో ఎన్ని అద్బుతమైన విషయాలను తెలుసుకుంటామో.. అంతే అసత్యాలను కూడా తెలుసుకుంటూ ఉంటాం. సమాజంలో కూడా కొంత మంచి.. కొంత చెడు అనేవి ఉంటాయి. అందులో మంచిని మాత్రమే స్వీకరించడం చాలా మంచిది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొక్కా (quokka) అనే జంతువు గురించి తెలుసుకుందాం.

అది పిల్లి అంత సైజులో ఉండే తోక ఉన్న జంతువులాంటిది. ఆస్ట్రేలియాలో కంగారూలు, వల్లబీలతోపాటే ఈ కొక్కాలు కూడా ఉంటాయి. కానీ ఇవి అంతగా కనిపించవు. ఇవి కేవలం రాత్రి పూట మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఇవి శాఖాహార జీవులు. అందువల్ల ఇవి పగలు కనిపించవు. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ కొక్కాకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జూకి వెళ్లిన ఓ మహిళ కొక్కాకు బొప్పాయి ముక్క ఒకటి ఇవ్వగా.. అది దానిని తీసుకొని ఎంతో సంతోషించింది.
దీంతో ఆ మహిళకు థాంక్స్ చెబుతూ… ఆమెను టచ్ చెయ్యబోయింది. కానీ ఆ మహిళ కాస్త వెనక్కి జరిగింది. దీనికి కారణం ఏంటంటే.. ఈ కొక్కాలను ఆస్ట్రేలియాలో ముట్టుకున్నా.. వాటికి ఆహారం పెట్టినా ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ ఎంత ఉంటుందో తెలుసా.. రూ.8వేల నుంచి రూ.5 లక్షల దాకా ఉంటుందట. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ జంతువులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇవి అంతరించే జంతువుల జాబితాలో చేరినా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం రాజీ పడట్లేదు. ఇక్కడ ఒక వీడియోలో కొక్కాను ఎత్తుకొని మరీ ఆహారం తినిపించుకుంటూ ఓ మహిళ కనిపించింది. ఆమె అక్కడ పర్యావరణ పరిరక్షణ ఉద్యోగిగా పనిచేస్తుంది. కావునా ఆమెకు ఎలాంటి నిబంధనలు ఉండవు. మన దేశంలో కూడా కొన్ని జంతువులు అంతరించే స్థితిలో ఉన్నాయని.. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కోరుతున్నారు.