Connect with us

Featured

దేశ పరిస్థితులపై సరికొత్త ఆలోచనలు రేకెత్తించే చిత్రం.. “విశ్వక్” మూవీ రివ్యూ !

Published

on

నటీనటులు: అజయ్ కుమార్ కథుర్వార్, డింపుల్ హయతి
దర్శకుడు: వేణు ముల్కల
నిర్మాత: తాటికొండ ఆనందమ్ బాలకృష్ణన్
మ్యూజిక్ డైరెక్టర్: సత్య సాగర్ పొలమ్
సినిమాటోగ్రాఫర్: ప్రదీప్ దేవ్
ఎడిటర్: విశ్వనాథ్
కొరియోగ్రఫి: రామ్ ఇసుకపాటి
బ్యానర్: గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-02-18

అజయ్ కతుర్వార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యమవుతున్న చిత్రం విశ్వ‌క్. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తాటికొండ ఆనందం బాల కృష్ణ నిర్మించారు. వేణు ముల్కాకా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కాగా ఈ సినిమా మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముఖ్యంగా యూత్ ని , ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది… ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

Advertisement

కథ విషయానికి వస్తే….
విశ్వక్ ను (అజయ్) అమెరికా పంపించాలని వాళ్ల నాన్న పట్టుబడతాడు. కానీ అజయ్ కి అమెరికా వెళ్లడం అస్సలు ఇష్టముండదు. ఇక్కడే ఉండి బిజినెస్ చేస్తా అంటాడు. ఆ విషయంలో తండ్రితో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఇదే ప్రయాణంలో తనలాంటి భావాలే ఉన్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అంతా బాగానే ఉంది అనుకుంటాడు. కానీ బిజినెస్ బాగా లాస్ అవుతుంది. తాను ఆనుకున్న కాన్సెప్ట్ ని స్పాన్సర్ చేసేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాదు. ఆఖరికి అమెరికా సంస్థ కూడా ఛీ కొడుతుంది. దీంతో కంపెనీ మూసే పరిస్థితికి చేరతాడు. ఆ తర్వాత మరోసారి కంపెనీ ఓపెనే చేసినప్పటికీ సక్సెస్ కాలేక పోతాడు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. తాను ప్రేమించిన అమ్మాయి కూడా దూరమవుతుంది. అదే సమయంలో అమెరికా వెళ్లాలనుకున్న ఒకరిని కిడ్నాప్ చేస్తాడు. అంతేకాదు ఇక్కడే ఉండి టాక్సులు కడుతున్న మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఎన్నారైలకు సవాల్ విసురుతాడు. ఇంతకూ అజయ్ ఏం చెప్పాలనుకున్నాడు. ఏం చేయలానుకున్నాడు. తాను బిజినెస్ లాస్ కావడానికి కారణాల్ని కనుక్కున్నాడా. తాను అనుకున్న గోల్ రీచ్ కాగలిగాడా లేదా అన్నది అసలు సినిమా.

మూవీ విశ్లేషణ :
ముందుకు ఈ చిత్ర హీరో అజయ్ గురించి మాట్లాడుకోవాలి. దర్శకుడు అనుకున్న పాయింట్ కు సరిగ్గా సరిపోయాడు. యూత్ ని రిప్రజెంట్ చేస్తూనే బాధ్యత కలిగిన భారతీయుడి పాత్రలో చాలా బాగా నటించాడు. సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆవేశంతో కూడిన డైలాగ్స్ ని తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించాడు. ఎక్కడా తన యాక్టింగ్ బోర్ కొట్టలేదు. పాత్రలో లీనమై నటించాడు. తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా తన కెరీర్ కు మరో మెట్టు ఎక్కించేలా యాక్టింగ్ చేసి చూపించాడు. తన లుక్స్ తో మెప్పించాడు. ఈ సినిమాలో చాలా మంది కొత్త నటీనటులు పరిచయమయ్యారు. వారంతా కూడా మంచి అనుభవం ఉన్న వారిలా నటించారు. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. పాత్రలకు తగ్గట్టుగా ఆర్టిస్టులు చాలా నటించారు.

ఇక దర్శకుడి విషయానికి వస్తే. ఈ తరహా సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ముందుగా గట్స్ కావాలి. ఇలాంటి సోషల్ మెసేజ్ ను ఇవ్వాలి అంటే చాలా ఆలోచించాలి. కానీ దర్శకుడు తాను అనుకున్న విషయాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. భారతీయతను ఎక్కడా తగ్గకుండా టెక్నాలజి, అభివృద్ధి, మన దగ్గర జరుగుతున్న ఆత్మహత్యల్ని ఇలా చాలా అంశాల్ని టచ్ చేశాడు. ఓ పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథను చెప్పేటప్పుడు సాధారణంగా బోర్ కొడుతుంది. కానీ దర్శకుడు మాత్రం ప్రతీ సీన్ ను కూడా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టనీయకుండా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా …. సిటీలో ఉండే విశ్వక్ పాత్రను, గ్రామంలో ఉండే వీరయ్య పాత్రలు ఆలోచించే తీరును ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. సిటీలో ఉండే వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు… గ్రామాల్లో ఉండే యూత్ ఎలా ఆలోచిస్తుందో చక్కగా చూపించగలిగాడు. జాన్స్ కి విశ్వక్ కు మధ్య జరిగే సీన్, తండ్రికి కొడుకుకు మధ్య జరిగే మాటల యుద్ధం, ఫ్రెండ్స్ మధ్య జరిగే వార్, మిలిటరీ ఆఫీసర్ కు హీరోకు మధ్య జరిగే సంభాషణలు, ఇండియా రూమ్ లో జరిగే డిస్కషన్స్, హీరోయిన్ ను గురించి హీరో చెప్పే బ్రేకప్ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నారు. థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయంటే కారణం హీరో పెర్ ఫార్మెన్స్, డైలాగ్స్ వల్లనే అని చెప్పాలి. ర‌చ‌యిత రాము బాగా మాట‌లు రాశాడు. దర్శకుడు వేణు ఈ సినిమాతో సక్సెస్ సాధించాడనే చెప్పాలి.

చిత్ర నిర్మాత ఆనందం బాలకృష్ణను మెచ్చుకోవాలి. ఈ తరహా సినిమాల్ని అందరూ తీయలేరు. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని దర్శకుడికి మంచి ఫ్రీడమ్ ఇచ్చాడని అర్థమవుతుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ లేకుండా సినిమా రూపొందించి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంగీత ద‌ర్శ‌కుడు స‌త్య‌సాగ‌ర్ ప్రధాన బలం. అద్భుతమైన పాటలందించాడు. ప్రతీ పాట సన్నివేశపరంగా బాగా కుదిరాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవల్ కు పెంచాడు. ప్రతీ పాట ఈసినిమాకు ప్రత్యేకమనే చెప్పాలి. గీత ర‌చ‌యిత ఎంతో ప్రాణం పెట్టి రాశారు. అర్థ‌వంతంగా వున్నాయి. ప్ర‌దీప్ కెమెరా అద్భుతంగా వ‌చ్చింది.

Advertisement

ఓవరాల్ గా చిత్ర కథ, హీరో పెర్ ఫార్మెన్స్, డైలాగ్స్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ సపోర్ట్, మంచి పాటలు, సాహిత్యం, కెమెరా వర్క్, నిర్మాణాత్మక విలువలు, ఫైనల్ గా దర్శకత్వ ప్రతిభ విశ్వక్ ను విశ్వవ్యాప్తం చేసిందనే చెప్పాలి. అన్ని ప్రాంతాల వారు అన్ని వర్గాల వారు చూసే చిత్రమిది. ఈ తరహా చిత్రాల్ని ఆదరించాల్సిన సమయమిది. సో గో అండ్ వాచిట్ ఇన్ థియేటర్స్

Rating : 3.25/5

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జనసేనాని!

Published

on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఒంటరిగా పోరాటం చేయకుండా తెలుగుదేశం బిజెపితో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన రోడ్డు షోలలో పాల్గొంటున్నారు.

ఇక ఈనెల 18 నుంచి నామినేషన్స్ కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ కి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.

Advertisement

ప్రారంభమైన నామినేషన్లు..
నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రమే ఈయన ఉప్పాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్స్ వేశారు మొదటి రోజు అసెంబ్లీ సెగ్మెంట్లకు 197 నామినేషన్ల దాఖలు కాగా, పార్లమెంట్ సెగ్మెంట్లకు 42 నామినేషన్ల దాఖలయ్యాయి. అందులో వైసీపీ, ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!